ఉత్తర్ప్రదేశ్లో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. వరుసకు వదిన, మరదలు అయ్యే ఇద్దరు యువతులు కలిసి ఇంట్లో నుంచి పారిపోయారు. చాలా రోజులుగా ప్రేమలో ఉన్న వారిద్దరు.. ఏడు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఎంత వెతికిన ఆచూకీ లభించకుండా జాగ్రత్తపడ్డారు. కాగా ఆ ఇద్దరు తాజాగా తిరిగి వచ్చి.. రక్షణ కల్పించాలంటు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. సంభాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహ్జోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఓ యువతి.. తన మరదలితో కలిసి నోయిడాలోని ఓ కంపెనీలు పని చేస్తుండేది. అదే సమయంలో వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అనంతరం కొద్ది రోజులు పాటు లివ్ఇన్ రిలేషన్షిప్లోనూ ఉన్నారు. కాగా దాదాపు ఏడు నెలల క్రితం వారిద్దరు ఇంట్లో నుంచి పారిపోయారు. కుమార్తె కనిపించకపోయే సరికి.. ఆమె తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారిద్దరిని వెతికే పనిలో పడ్డారు. కాగా కొద్ది రోజుల తరువాత ఆ యువతి తన మరదలితో కలిసి పారిపోయిందని కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. మొరాదాబాద్ జిల్లాలోని బిలారి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటోందని సమాచారం అందుకున్నారు. వారి కోసం కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభినప్పటికీ.. ఎటువంటి ఆచూకీ లభించలేదు.