girl killed her girlfriend in Mancherial: ఇద్దరు యువతుల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. అదికాస్త సహజీవనం వరకు వెళ్లింది. చివరకు హత్యకు దారితీసింది. అబ్బాయితో సన్నిహితంగా ఉంటోందన్న కోపంతో ఒక యువతి తన ప్రేయసిని హత్య చేసిన ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
మృతురాలి కుటుంబసభ్యులు, స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టుకు చెందిన సల్లూరి అంజలి అనే యువతి (21) నెన్నెల మండలం మన్నెగూడంలోని తన అమ్మమ్మ ఇంటికి తరచూ వెళ్తుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పెరుగు మహేశ్వరి అలియాస్ మహేష్‌తో అంజిలికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసి.. రెండేళ్ల నుంచి మంచిర్యాలలో అద్దెకుంటున్న మహేశ్వరితో అంజలి సహజీవం మొదలుపెట్టింది. వీరితో పాటు ఆ ఇంట్లో మహేశ్వరి చెల్లి పరమేశ్వరి, సోదరుడు విఘ్నేష్ కూడా ఉండేవారు.
girl killed her girlfriend in Mandamarri : అంజలి స్థానిక కళ్లద్దాల దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. మహేశ్వరి ఓ పెట్రోల్ బంకులో పనిచేసి వ్యక్తిగత కారణలతో ఇటీవల మానేసింది. మన్నెగూడం వీఆర్‌ఏ మొండి ఐదుగురు ఆడపిల్లల్లో నాలుగో కుమార్తె మహేశ్వరి. గత పదేళ్లుగా ఆమె వస్త్రధారణ, ప్రవర్తన అబ్బాయిలా మారుతూ వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మహేశ్వరి, అంజలి సహజీవనం కూడా చేస్తున్నారని చెబుతున్నారు.
కొన్ని రోజులుగా దూరం..:మంచిర్యాలలో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న శ్రీనివాస్‌తో మహేశ్వరికి పరిచయం ఏర్పడగా.. తర్వాత ఆమె చెల్లెలు, సోదరుడు, అంజలితోనూ ఆయన స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు. రెండు నెలలుగా అంజలి.. శ్రీనివాస్‌తో సన్నిహితంగా ఉంటూ మహేశ్వరిని కొద్దిగా దూరం పెట్టింది. బుధవారం విధులు ముగించుకున్న అంజలి రాత్రి 8.15 గంటల సమయంలో తన గదికి వెళ్లింది. అప్పటికే ఇంట్లో ఉన్న మహేశ్వరి.. రాత్రి 10 గంటల సమయంలో.. మామిడిగట్టుకు వెళ్దామంటూ అంజలిని బైక్‌పై తీసుకొని బయల్దేరింది.
రాత్రి 11.30 గంటల సమయంలో శ్రీనివాస్‌కు మహేశ్వరి ఫోన్ చేసి అంజలి ఆత్మహత్య చేసుకుందని.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. మహేశ్వరి చెల్లెలు పరమేశ్వరితో కలిసి శ్రీనివాస్.. కారులో గుడిపల్లి గ్రామ శివారుకు వెళ్లాడు. అపస్మారక స్థితిలో ఉన్న అంజలిని, స్వల్పంగా గాయపడిన మహేశ్వరిని గుర్తించి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అంజలి మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.