Girl Fell Into Borewell : ఇంటి ముందు ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారిని కాపాడేందుకు అనేక గంటల పాటు అధికారులు తీవ్రంగా శ్రమించినప్పటికి.. ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరోంజ్ పట్టణంలో కజారి బరాఖేడా గ్రామంలో.. మంగళవారం ఉదయం చిన్నారి బోరుబావిలో పడినట్లు సహాయక బృందాలకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లిన అధికారులు.. రెస్కూ ఆపరేషన్ చేపట్టారు. అనంతరం చిన్నారిని బయటకు తీసి.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు తెలిపారు.
బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి మృతి.. ఉదయం నుంచి అందులోనే.. బోరుబావి నుంచి బాలుడు బయటకు.. NDRF ఆపరేషన్ సక్సెస్..
నెల రోజుల క్రితం కూడా రాజస్థాన్‌లో ఓ 9 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. ఆ ఘటనలో సహాయక బృందాల చేసిన శ్రమ ఫలించింది. ఏడు గంటలపాటు సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎట్టకేలకు బాలుడ్ని సురక్షితంగా బయటకు తీశాయి. చిన్నారి 300 అడుగుల లోతైన బావిలో 70 అడుగుల లోతున చిక్కుకున్నాడు.
జయపుర జిల్లాలోని భోజ్‌పురా గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామ శివార్లలో ఉన్న బోరుబావి చాలా కాలంగా మూసి ఉంది. గ్రామస్థులు ఆ బోరుబావిని రాయితో కప్పివేశారు. అయితే గ్రామంలోని కొందరు పిల్లలు ఆడుకుంటా ఆ బోరుబావి వద్దకు వెళ్లారు. ఆ తర్వాత అనుకోకుండా ఆ రాయిని తొలగించారు. ఆ సమయంలో అక్షిత్ అలియాస్ లక్కీ అనే బాలుడు.. బోరుబావిలో పడిపోయాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
50 అడుగుల బావిలో పడ్డ 12 ఏళ్ల బాలుడు.. 104 గంటలు శ్రమించి..
ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్ చంపా జిల్లాలో కొన్నిరోజుల క్రితం ఇలాంటి ఘటనే జరిగింది. ఓ 12 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. దాదాపు 104 గంటల శ్రమించి.. ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు బాలుడిని బయటకు తీశారు అధికారులు. ప్రత్యేక అంబులెన్స్‌లో బిలాస్‌పూర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.