Girl Dies of Heart Attack Karimnagar :ఒకప్పుడు సుమారు 60 సంవత్సరాలు దాటితే గానీ.. దరి చేరని గుండె సమస్యలు.. ఈ మధ్య కాలంలో వయుస్సుతో సంబంధం లేకుండా అందరికీ వచ్చేస్తున్నాయి. అర్ధాంతరంగా వారి జీవితాలను ముగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా యువకులు గుండెపోటు(Heart Attack)తో మృతి చెందిన వార్తలు చూస్తే మరింత కలచివేస్తున్నాయి. జిమ్‌లో కసరత్తులు చేస్తూ.. పెళ్లి బరాత్‌లో డాన్స్‌లు చేస్తూ.. చిన్నపిల్లలు ఆడుకుంటూ.. గుండెపోటుతో మృత్యు కౌగిలిలోకి వెళ్లిపోతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఓ విద్యార్థిని తోటి స్నేహితులతో డాన్స్ చేస్తుండగా.. గుండెపోటుకు గురైంది. తోటి వారు సీపీఆర్ (CPR) చేసినా ఫలితం లేకపోవడంతో అక్కడిక్కడే మృతి చెందింది.
స్థానికుల కథనం ప్రకారం..జిల్లాలోని గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన గుండు అంజయ్య, శారదల కుమార్తె ప్రదీప్తి (16)కి చిన్నప్పటి నుంచే గుండెలో రంధ్రం ఉంది. దీనికి ఆపరేషన్ చేయించాలని అప్పట్లో వైద్యులు సూచించగా.. పేదరికం కారణంతో తల్లిదండ్రులు వైద్యం చేయించలేకపోయారు. కానీ చిన్నప్పటి నుంచి ప్రదీప్తి మాత్రం.. చదువులోనూ, అటు ఆటల్లో తోటీ విద్యార్థులతో చురుకుగా ఉండేంది. ఈ క్రమంలో న్యాలకొండపల్లి ప్రభుత్వ ఆదర్శ కళాశాలలో ఇంటర్ చదువుతోంది.
బరాత్‌లో డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటు.. వరుడి సోదరుడు మృతి
Girl Dies of Heart Attack while Dancing Karimnagar : శుక్రవారం కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొంది. అంతే కాదు తోటి విద్యార్థులతో కలిసి డాన్స్‌లు కూడా చేసింది. ఈ క్రమంలో ఒక్క సారిగా గుండెపోటుతో కుప్పకూలింది. దీంతో కళాశాల వైద్య సిబ్బంది వెంటనేసీపీఆర్‌చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రదీప్తి మృతి చెందినట్లు అక్కడి డాక్టర్లు ధ్రువీకరించారు. యువతి మరణంతో తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Heartburn VS Heart Attack : గ్యాస్ నొప్పికి, గుండెపోటుకి మధ్య తేడాలు ఏంటి? డాక్టర్లు ఏం అన్నారంటే..
Doctors Advice on Heart Disease :మరోవైపు రాష్ట్రంలో ఇటీవల కాలంలో చిన్న వయుస్సులోనే గుండె సంబంధిత వ్యాధులు అధికం కావడం ఆందోళన కలిస్తోంది. దీనిపై రెయిన్‌బో హాస్పిటల్ (Rainbow Hospitals)పిల్లల గుండె వైద్య నిపుణులు డా. కోనేటి నాగేశ్వర్‌రావు వద్ద ప్రస్తవించగా.. వాటిపై తీసుకోవాల్సి జాగ్రత్త చర్యలు..? ప్రాథమిక దశలో గుర్తించడం ఎలా..? అనేదానిపై కొన్ని సూచనలు చేశారు.