అప్పటివరకు హోంవర్క్ చేసుకుంటూ ఉన్న ఆ చిన్నారి.. గొంతులో పెన్సిల్ పొట్టు ఇరుక్కొని ఊపిరాడక చనిపోయింది. గొంతులో పెన్సిల్ పొట్టు అడ్డం పడి కొట్టుమిట్టాడుతున్న ఆ చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే తను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌లో జరిగిన ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
హోంవర్క్ చేస్తూ చిన్నారి మృతి.. పెన్సిల్ పొట్టు గొంతులో ఇరుక్కొని.. - హిమాచల్ ప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
పెన్సిల్ పొట్టు ఓ చిన్నారి ప్రాణం తీసింది. అప్పటి వరకు హోమ్ వర్క్ రాసుకుంటూ తమ కళ్లెదుట ఉన్న చిన్నారి ఇంతలోనే తమను వదిలి దూరంగా వెళ్లిపోతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. హిమాచల్‌లో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అసలేం జరిగింది:
హిమాచల్ ప్రదేశ్ హమీర్‌పూర్ జిల్లాలోని రాఠ్ ప్రాంతంలో నివసిస్తున్న నందకిశోర్‌కు ముగ్గురు పిల్లలు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో పిల్లలు డాబాపై చదువుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్నారి ఆర్తిక తన పెన్సిల్‌ను షార్ప్ చేస్తోంది. ఆలా షార్ప్ చేస్తున్నప్పుడు వచ్చిన చెత్త అకస్మాత్తుగా తన గొంతులో ఇరుక్కుంది. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన చిన్నారి ఊపిరి ఆడక అపస్మారక స్థితికి చేరుకుంది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆర్తికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.