తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Girl burnt alive from lamp: దీపం వెలిగిస్తుండగా.. యువతి సజీవదహనం - sundargarh girl burnt alive

Girl burnt alive form lamp: దీపం వెలిగిస్తుండగా దుస్తులకు మంటలు అంటుకుని సజీవదహనం అయ్యింది ఓ యువతి. ఈ విషాద ఘటన ఒడిశా సుందర్​గఢ్ జిల్లాలో జరిగింది.

girl burnt alive form lamp
సజీవదహనం

By

Published : Dec 14, 2021, 10:51 AM IST

Girl Burnt Alive From Lamp: ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా భలుదుంగురి గ్రామంలో సోమవారం రాత్రి విషాద ఘటన జరిగింది. కిరోసిన్​ దీపం వెలిగిస్తుండగా ఓ యువతి దుస్తులకు మంటలు అంటుకుని సజీవ దహనం అయ్యింది. మృతురాలిని స్వప్నేశ్వరి ముందాగా గుర్తించారు.

Odisha Girl Burnt Alive News:

స్వప్నేశ్వరి లాహునిపాడులో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతోంది. సోమవారం రాత్రి ఇంట్లో కిరోసిన్ దీపం వెలిగిస్తుండగా దుస్తులకు మంటలు అంటుకున్నాయి. తీవ్రగాయాలైన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. స్వప్నేశ్వరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details