Girl breaks 4 year silence: పాఠశాలలో అనుభవించిన క్షోభతో.. ఓ బాలిక మూణ్నాలుగేళ్లు వెక్కి వెక్కి ఏడ్చింది. పీటీ మాస్టర్ చేతిలో రెండు సార్లు అత్యాచారానికి గురైన ఆ బాధితురాలు.. తన బాధను ఎవరితో చెప్పుకోకుండా ఇన్నేళ్లు మౌనం దాల్చింది. ఇప్పుడదే కామాంధుడు తన చెల్లినీ వేధించేసరికి ఆక్రోశంతో.. పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. రాజస్థాన్ నాగౌర్ జిల్లాలో జరిగిందీ ఘటన.
ఇదీ జరిగింది..
ఎఫ్ఐఆర్ ప్రకారం.. బాధితురాలు 2018లో 9వ తరగతి చదువుతున్న సమయంలో.. హరిరామ్(30) అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. ఖాళీగా ఉన్న ఓ క్లాస్‌రూంలోకి తీసుకెళ్లి ఈ దురాఘతానికి ఒడిగట్టాడు. 10వ తరగతి చదివే సమయంలో మరోసారి అత్యాచారం చేశాడు.
స్కూల్ మానేసిన బాలిక.. అప్పటి నుంచి భయం, బాధతో మానసిక క్షోభను అనుభవిస్తూ ఇంట్లోనే తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.