ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బ్లాక్(Black Fungus), వైట్, ఎల్లో ఫంగస్ సోకిన తొలి కరోనా బాధితుడు కన్నుమూశారు. కున్వర్ సింగ్ అనే 59 ఏళ్ల ఈ వ్యక్తికి రక్తం విషపూరితంగా మారడం వల్ల చనిపోయినట్లు ఆయనకు చికిత్స చేసిన హర్ష్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ సోకిన తొలి రోగి మృతి - బ్లాక్ ఫంగస్ సోకిన కరోనా రోగి మృతి
దేశంలో బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ (fungus) సోకిన తొలి కరోనా బాధితుడు చనిపోయారు. రక్తం విషపూరితంగా మారి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు.
Ghaziabad man with yellow, black and white fungus dies
ఇటీవల కరోనా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన కున్వర్‌కు ఈ నెల 24న నిర్వహించిన ఎండోస్కోపీ పరీక్షల్లో బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ సోకినట్లు తేలిందని వెల్లడించారు. దేశంలో మూడు ఫంగస్‌లు సోకిన తొలి వ్యక్తి ఈయనే.
ఇదీ చూడండి:Sputnik V: టీకా పేరుతో మోసాలు