తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వధువును సంతోషపెట్టడానికి.. వరుడి కాల్పులు.. - పెళ్లిలో కాల్పులు జరిపిన వరుడు

గాజియాబాద్​లో వధువును సంతోషపెట్టడానికి పెళ్లిలోనే గాల్లోకి కాల్పులు జరిపాడు వరుడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

harsh firing in ghaziabad
నూతన వధూవరులు

By

Published : Dec 10, 2021, 5:54 AM IST

Updated : Dec 10, 2021, 12:33 PM IST

వధువును సంతోషపెట్టడానికి.. వరుడి కాల్పులు..

గాజియాబాద్​లో ఓ వరుడు చేసిన పని సర్వత్రా విమర్శలకు దారితీసింది. పెళ్లి కూతురును సంతోషపెట్టడానికి పెళ్లిలోనే గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ వీడియో సామాజికా మాధ్యమాల్లో వైరల్​గా​ మారింది.

నూతన వధూవరులు

జిల్లాలో ఇందిరాపురంలోని ఓ ఫామ్ హౌజ్​లో ఓ జంట వివాహం చేసుకుంది. పెళ్లి తంతు ముగియగానే ఊరేగింపు కోసం బయటికి వచ్చారు. నూతన వధూవరులిద్దరు కారులో కూర్చోడానికి సిద్ధమయ్యారు. బంధువులంతా పక్కనే ఉన్నారు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు పిస్టల్​ తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. వధువు బయపడుతూనే ఆనందాన్ని వ్యక్తపరిచింది. పిస్టల్​ దిశను పైకి ఉంచమని కోరింది. వధువును సంతోషపెట్టడానికి వరుడు ఈ మేరకు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో తెగ వైరల్ అయింది. కాల్పులు జరిపి చట్టాన్ని ఉల్లంఘించినందుకు శిక్షించాలనే డిమాండ్లు వచ్చాయి.

పెళ్లిలో గాల్లోకి కాల్పులు జరిపిన వరుడు

దీనిపై స్పందించిన పోలీసులు.. వీడియోను పరిశీలిస్తున్నామని తెలిపారు. త్వరలో కేసు నమోదు చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:'బార్డర్​' బాబుకు వీసా మంజూరు.. స్వదేశానికి ఎప్పుడంటే?

Last Updated : Dec 10, 2021, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details