స్కూల్ బస్సు-కారు ఢీ కొన్న ఘటనలో ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదం ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లో మేరఠ్-దిల్లీ ఎక్స్ప్రేస్వేపై జరిగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు సహా మహిళలు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పాఠశాల బస్సు రాంగ్ రూట్లో అతి వేగంగా రావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. బస్సులో పిల్లలు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. రెండు వాహనాలను తొలగించిన పోలీసులు.. ట్రాఫిక్‌ను పనురుద్ధరించారు.
"దిల్లీ-మేరఠ్ ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం ఉదయం 6 గంటలకు ఓ కారు-స్కూల్ బస్సు ఢీ కొన్నాయి. గాజీపుర్ వద్ద బస్సులో సీఎన్జీ నింపించుకున్న డ్రైవర్ రాంగ్ రూట్లో వస్తున్నాడు. ఈ క్రమంలోనే మేరఠ్ నుంచి వస్తున్న ఓ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాం. బస్సు డ్రైవర్ రాంగ్ రూట్లో రావడమే ప్రమాదానికి ప్రధాన కారణం."
-రమానంద్ కుశ్వాహ, ఏడీసీపీ ట్రాఫిక్
12కు చేరిన ట్యాంకర్ మృతుల సంఖ్య
Uttar Pradesh Accident Today : ఓ ట్యాంకర్.. లగేజ్ వ్యాన్‌పై బోల్తా కొట్టిన ఘటనలో మృతుల సంఖ్య 12 మందికి చేరింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో సోమవారం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ప్రతాప్‌గఢ్ మెడికల్ కాలేజీకి తరలించారు.