Ghaziabad family cheating: ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌కు చెందిన ఓ కుటుంబం.. నకిలీ కంపెనీలు, పత్రాలు సృష్టించి రూ.100 కోట్లకు పైగా మోసాలకు పాల్పడింది. తప్పుడు ధ్రువపత్రాలతో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తూ అనేక మందికి టోకరా వేసింది. నకిలీ ఆధార్ కార్డులను సైతం నిందితులు తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. దుబాయ్ పారిపోయేందుకు యత్నిస్తుండగా పట్టుకొని అరెస్టు చేశారు.
UP crime news
పోలీసుల కథనం ప్రకారం.. గాజియాబాద్‌లోని నంద్‌గ్రామ్‌కు చెందిన ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ జైన్.. తన భార్య, ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తెతో కలిసి ఈ మోసాలు చేశాడు. వీరికి మరో ఇద్దరు బంధువులు సైతం తోడయ్యారు. తప్పుడు పత్రాలను తయారు చేసి.. ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లను ఒకటికంటే ఎక్కువసార్లు విక్రయించారు. తక్కువ ధరకే వీటిని అమ్మేయడం వల్ల.. అనేక మంది వీరి వలలో చిక్కారు. వీరిపై 29కన్నా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. వీరి అరెస్టుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు పోలీసులు. అయితే, ఎప్పటికప్పుడు వారి గుర్తింపును మార్చుకుంటూ తప్పించుకు తిరిగారు ఈ కేటుగాళ్లు.