కరోనా టీకా స్వీకరించేలా ప్రజలను ప్రోత్సహించడానికి మహారాష్ట్ర మంత్రి సునీల్ ఖేదర్ వినూత్న ప్రయత్నం చేశారు. అర్హులకు వంద శాతం వ్యాక్సినేషన్ సాధించిన గ్రామపంచాయతీలకు, నగరపంచాయతీలకు రూ.5లక్షల బహుమతి ప్రకటించారు. ఈ నగదు బహుమతి వార్ధా జిల్లాలోని 8 మండలాల పరిధిలోని పంచాయతీలకు, నగర పంచాయతీలకు మాత్రమే.
'టీకా వేసుకోండి.. రూ.5లక్షలు గెలుచుకోండి' - మంత్రి సునీల్ ఖేదర్
నూరు శాతం వ్యాక్సినేషన్ నమోదు చేసిన పంచాయతీలకు నగదు పురస్కారం ఇస్తామని ప్రకటించారు మహారాష్ట్ర మంత్రి. ఒక్కో పంచాయతీకి రూ.5లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు.

టీకా
నగదు పురస్కారం ప్రకటిస్తేనన్నా ప్రజలు టీకాను వేయించుకుంటారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:'ఆఘాడీ సర్కారును కూల్చేందుకే ఈ కుట్రలు'