తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తల్లీబిడ్డలను వేరు చేసిన జర్మనీ ప్రభుత్వం.. దిల్లీలో బంధువుల ఆందోళన - చిన్నారిని అదుపులోకి తీసుకున్న జర్మనీ

భారత సంతతికి చెందిన తల్లిబిడ్డలను వేరు చేసింది జర్మనీ ప్రభుత్వం. తల్లిదండ్రులు.. చిన్నారిని సరిగ్గా చూసుకోవడం లేదంటూ ఆమెను అదుపులోకి తీసుకుంది.

indian girl detain in germany
ఆందోళన చేపట్టిన బంధువులు

By

Published : Oct 15, 2022, 4:30 PM IST

భారతదేశానికి చెందిన దంపతుల 20నెలల చిన్నారిని అదుపులోకి తీసుకుంది జర్మనీ ప్రభుత్వం. చిన్నారిని తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవడం లేదంటూ తల్లి బిడ్డలను వేరు చేసింది. దీంతో బతుకుదెరువు కోసం జర్మనీ వెళ్లిన ఓ కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జైన మతానికి చెందిన తాము పూర్తిగా శాఖాహారులమని.. జర్మనీలోని మాంసాహార వాతావరణంలో తమ కుమార్తెను పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ చిన్నారిని తమకు అప్పగించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఈ మేరకు దిల్లీలో వారి బంధువులు ఆందోళనకు దిగారు.

ఆందోళన చేపట్టిన బంధువులు
ఆందోళన చేపట్టిన బంధువులు

ఇదీ జరిగింది
గుజరాత్​ అహ్మదాబాద్​కు చెందిన ఓ జంట ఉద్యోగం కోసం 2018లో జర్మనీ రాజధాని బెర్లిన్​ వెళ్లింది. 2020లో వీరిద్దరికి చిన్నారి జన్మించింది. ఆమె 7 నెలల వయసులో ఉన్నప్పుడు గాయం కావడం వల్ల స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేసిన వైద్యులు తిరిగి ఇంటికి పంపించారు. రెండు రోజుల తర్వాత చికిత్స నిమిత్తం పిలిచిన వైద్యులు.. చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవడం లేదని.. పాపకు అపాయం జరిగే అవకాశం ఉన్నందున తమ పర్యవేక్షణలో ఉంచుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై న్యాయస్థానాలను ఆశ్రయించారు తల్లిదండ్రులు. డీఎన్​ఏ, మానసిక పరీక్షల పత్రాలు సమర్పించినా.. ఎలాంటి ఫలితం దక్కలేదు. చట్టాల పేరిట తల్లిబిడ్డలను వేరు చేస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై భారత విదేశీ మంత్రిత్వ శాఖ, జర్మనీ రాయబారికి బంధువులు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details