భారతీయ సంప్రదాయాలు, కట్టుబొట్టూ ఇష్టపడే ఓ జర్మనీ యువతి.. ఇక్కడి వ్యక్తినే ప్రేమించి పెళ్లాడింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శ్రేష్ఠ అనే యువకుడితో.. ప్రేమలో పడిన జెనిఫర్ ఖండాలు దాటొచ్చి అతడిని మనువాడింది. భారతీయ హిందూ సంప్రదాయం ప్రకారం.. ఇరువురికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. రాజస్థాన్ భరత్‌పుర్‌లోని ఓ హోటల్ ఈ పెళ్లికి వేదికైంది. జర్మనీ నుంచి వచ్చిన వధువు కుటుంబసభ్యులు కూడా ఎంతో ఆనందంగా వివాహంలో పాల్గొని చిందులేశారు.
ఖండాలు దాటిన ప్రేమ.. ఒక్కటైన భారతీయ యువకుడు, జర్మనీ యువతి - ఫారినర్‌ను పెళ్లాడిన ఇండియన్
భారతీయ యువకుడు.. జర్మన్ యువతి వివాహబంధంతో ఒక్కటయ్యారు. భారతీయ సంప్రదాయం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ వేడుకలు ఎక్కడ జరిగాయంటే?
ఖండాలు దాటిన ప్రేమ.. ఒక్కటైన భారతీయ యువకుడు, జర్మనీ యువతి
శ్రేష్ఠ జర్మనీలో ఇంజినీరింగ్ చేసి.. అక్కడే ఓ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. జెనిఫర్‌తో అతడికి స్నేహం కుదిరింది. మూడేళ్లు స్నేహితులుగానే ఉన్న తర్వాత శ్రేష్ఠ.. జెనిఫర్‌కు తన మనసులో మాట చెప్పాడు. అందుకు యువతి అంగీకరించింది. వారి ప్రేమను ఇరు కుటుంబసభ్యులు ఆమోదించి.. వివాహం నిశ్చయించారు. శ్రేష్ఠను ప్రేమించక ముందు కూడా తాను చాలాసార్లు భారత్‌కు వచ్చినట్లు జెనిఫర్ తెలిపింది. ఇండియా అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఇక్కడి ఆచారాలు తనను కట్టిపడేశాయని జెనిఫర్ వివరించింది.
Last Updated : Dec 14, 2022, 6:17 AM IST