భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవాణే సౌదీ జనరల్ స్థాయి అధికారులతో ఆదివారం సమావేశమయ్యారు. గల్ఫ్ దేశాల చారిత్రక పర్యటన సందర్భంగా.. ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాల బలోపేతం చేయడం సహా ఇరు దేశాల ప్రయోజనాలపై సౌదీ కమాండర్ జనరల్ బిన్ అబ్దుల్లా మహమ్మద్ అల్ ముతీర్తో చర్చించారు. ఈ భేటీలో సౌదీ జనరల్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
గల్ఫ్ దేశాల్లో వ్యూహాత్మకంగా కీలకమైన యునైటెట్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సౌదీ అరేబీయాలో పర్యటించిన భారత ఆర్మీ చీఫ్ అధికారి జనరల్ నరవాణేనే కావడం గమనార్హం.