తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాష్ట్ర ప్రభుత్వంపై జనరల్​ రావత్ బావమరిది ఆగ్రహం - helicopter crash

General Bipin Rawat brother in law: భారత త్రివిధ దళాధిపతి, దివంగత జనరల్​ బిపిన్​ రావత్ బావమరిది.. మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అసలేం జరిగిందంటే?

General Bipin Rawat, జనరల్​ బిపిన్​ రావత్​
General Bipin Rawat, జనరల్​ బిపిన్​ రావత్​

By

Published : Dec 15, 2021, 3:51 PM IST

Updated : Dec 15, 2021, 4:36 PM IST

General Bipin Rawat brother in law: అనుమతి లేకుండా మధ్యప్రదేశ్​ ప్రభుత్వం తన భూమిని స్వాధీనం చేసుకుందని ఆరోపించారు సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​ బావమరిది యశోవర్ధన్​ సింగ్​. జాతీయ రహదారి పనుల కోసం తన భూమిని వినియోగిస్తున్నట్లు ఫేస్​బుక్​లో ఓ పోస్ట్​ పెట్టారు.

తన సోదరి మధులికా రావత్​, జనరల్ బిపిన్​ రావత్​ అంత్యక్రియల రోజు ఇది గుర్తించినట్లు ఆయన చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి నష్టపరిహారం అందించలేదని, ముందస్తు సమాచారమూ ఇవ్వలేదని యశో​వర్ధన్​ తెలిపారు.

జనరల్​ బిపిన్​ రావత్​ బావమరిది పోస్ట్​

''భూమి తీసుకున్నందుకు నాకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. ఎవరైనా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు అందాయి.''

- యశో​వర్ధన్​ సింగ్​

మధులిక స్వస్థలమైన మధ్యప్రదేశ్​లోని రాజాబాఘ్ సోహగ్​పుర్​లోనే.. జాతీయ రహదారికి ఆనుకొని యశో​వర్ధన్​కు కొంత భూమి ఉంది. ప్రస్తుతం అక్కడే జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ విషయం జిల్లా కలెక్టర్​ వందనా వైద్య వరకు చేరింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తానని, తహశీల్దార్​ సహా ఇతర అధికారులను సంఘటనా స్థలానికి పంపుతామని ఆమె చెప్పారు. విచారణ అనంతరమే.. ఈ అంశంపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు.

ఇదే అంశంపై రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్​ మిశ్రా కూడా ట్వీట్​ చేశారు. శహ్​డోల్​ ఎస్పీ నుంచి పూర్తి వివరాలు కోరిన ఆయన.. ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు తెలిస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

హెలికాప్టర్​ ప్రమాదంలో..

Chopper Crash: డిసెంబర్​ 8న జరిగిన ఘోర హెలికాప్టర్​ ప్రమాదంలో జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య మధులికతో పాటు మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 13 మంది ఆరోజే చనిపోగా.. గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ఆయన 8 రోజులు మృత్యువుతో పోరాడి ఓడారు.

ఇవీ చూడండి:'కొనప్రాణాలతో సీడీఎస్​ రావత్‌.. నీళ్లు కావాలని అడిగారు'

'రావత్​ నిజమైన నాయకుడు-మంచి స్నేహితుడు'

Last Updated : Dec 15, 2021, 4:36 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details