తూర్పు దిల్లీలోని గాజిపుర్లో పింకీ అనే యువతిని చేతన్ నిత్యం హింసచేవాడు(ghazipur crime news). తనని పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. హింసను తట్టుకోలేక పింకీ అతడిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత కూడా చేతన్ ప్రవర్తనలో మార్పు రాలేదు. పింకీని చిత్రహింసలు పెట్టాడు. ఇక చేతన్ నుంచి విముక్తి పొందాలని నిర్ణయించుకున్న పింకీ.. అతడి నుంచి విడాకులు తీసుకుంది.
విడాకులు వచ్చినప్పటికీ పింకీని చేతన్ విడిచిపెట్టలేదు. ఆమెను వెంబడించేవాడు. ఈ క్రమంలోనే పింకీకి రెండో పెళ్లి జరుగుతున్నట్టు, ఆమె కుటుంబసభ్యులు సంబంధాలు వెతుకుతున్నట్టు చేతన్ తెలుసుకున్నాడు. కోపంతో.. మరో వ్యక్తితో కలిసి ఆదివారం నాడు పింకీ ఇంటికెళ్లాడు. చేతన్ తన వెంట యాసిడ్ బాటిల్(acid attack) తీసుకెళ్లి, ఎవరినైనా పెళ్లిచేసుకుంటే ముఖంపై యాసిడ్ పోస్తానని బెదిరించాడు. అదే నిజమవుతుందని భయపడి.. ఆ రోజు రాత్రి ఆమె తన గదిలో ఆత్మహత్య చేసుకుంది.