Gaumutra Row In Lok Sabha : భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కమలం పార్టీ కేవలం గోమూత్ర అని పిలుచుకునే హిందీ రాష్ట్రాల్లో మాత్రమే గెలువగలుగుతుందని అన్నారు. జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన రెండు బిల్లులపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. జమ్ముకశ్మీర్‌లో గెలవలేమని తెలిసే ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసి, గవర్నర్ ద్వారా అధికారం చెలాయిస్తోందని ఎంపీ సెంథిల్ కుమార్ విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా గెలువలేదని జోస్యం చెప్పారు.
"బీజేపీ ఇటీవలి కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో గెలిచింది. మైక్రో మేనేజ్‌మెంట్ ద్వారా వరుసగా ఎన్నికల్లో గెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌లో ఏమైంది? అక్కడ ఎందుకు గెలవలేకపోయారు. రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేసి గవర్నర్ ద్వారా అధికారం చెలాయిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో గెలిచే సత్తా, సమర్థత ఉంటే కేంద్రపాలిత ప్రాంతం చేసేవారు కాదు. బీజేపీ అధికారం కేవలం గోమూత్ర అని పిలుచుకునే హిందీ రాష్ట్రాల్లోనే అని దేశ ప్రజలు తెలుసుకోవాలి. బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు రాలేదు."
--సెంథిల్‌కుమార్,డీఎంకే ఎంపీ