తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీ నిరసనలకు రైతు సంఘాల పిలుపు - వ్యవసాయ చట్టాలు

రైతుల డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసనలు చేపడతామని సంయుక్త కిసాన్​ మోర్చా (ఎస్​కేఎమ్)​ తెలిపింది. ఈ నెల 26న దేశంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ఆందోళనల్లో(farmer protest) రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది.

farmer protest
వ్యవసాయ చట్టాలు

By

Published : Nov 20, 2021, 7:45 PM IST

వ్యవసాయ చట్టాలను ఉపసంహరించినప్పటికీ(farm laws withdrawn) ఆందోళనలు కొనసాగుతాయని సంయుక్త కిసాన్​ మోర్చా (ఎస్​కేఎమ్​) తేల్చిచెప్పింది. చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు (farmer protest) ప్రారంభించి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో.. ఈ నెల 26న దేశంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ఆందోళనలకు రైతులు భారీ సంఖ్యలో తరలి రావాలని విజ్ఞప్తి చేసింది. ఆ రోజున.. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో పరేడ్​ నిర్వహిస్తామని వెల్లడించింది.

రైతుల డిమాండ్లు నెరవేరే వరకు నిరసనలు చేపడతామని ఎస్​కేఎమ్​ స్పష్టం చేసింది. భవిష్యత్​ కార్యచరణ, కనీస మద్దతు ధరపై పోరాటానికి సంబంధించిన తుది నిర్ణయం ఆదివారం తీసుకుంటామని వెల్లడించింది. 'దాదాపు 670 మంది రైతులు బలిదానం చేసుకున్నారు. వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి. ఈ పోరాటానికి ఓ స్మారకాన్ని నిర్మించాలి. రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. ఈ నెల 29న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా శాంతియుత ట్రాక్టర్ ర్యాలీలను నిర్వహిస్తాం. ఎమ్​ఎస్​పీ, విద్యుత్​ బిల్లులను రద్దు చేసేవరకు ఇది కొనసాగుతుంది,' అని ఓ ప్రకటనలో ఎస్​కేఎమ్​ తెలిపింది.

ఈ నెల 22న నిర్వహిస్తున్న 'కిసాన్ మహాపంచాయత్'​తో పెద్దసంఖ్యలో రైతులు పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది.

ABOUT THE AUTHOR

...view details