తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒక్కసారిగా గ్యాస్ ​లీక్​.. 11 మంది మృతి.. ఇళ్లల్లోనే స్పృహ తప్పిన ప్రజలు!

గ్యాస్ లీక్ కారణంగా పంజాబ్ లుధియానాలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

GAS LEAK in LUDHIANA punjab several dead
GAS LEAK in LUDHIANA punjab several dead

By

Published : Apr 30, 2023, 10:31 AM IST

Updated : Apr 30, 2023, 2:32 PM IST

Punjab Gas Leak : పంజాబ్​ లుధియానాలో గ్యాస్​ లీక్​ కావడం వల్ల ఇద్దరు చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్​ లీకైన ప్రదేశం నుంచి 300 మీటర్ల పరిధిలో ప్రజలు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడ్డారు. కొందరు ఇళ్లలోనే స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటన ఆదివారం ఉదయం లుధియానాలోని గియాస్​పుర్ ప్రాంతంలో జరిగింది. అసలు లీకైన గ్యాస్‌ ఏంటి? ఎక్కడి నుంచి వెలువడింది? వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

గ్యాస్​ లీక్​పై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్​ఆర్​ఎఫ్​ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టాయి. ఆ ప్రాంతాన్ని సీల్​ చేసి.. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారని.. వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడమే తమ ప్రాధాన్యం అని జిల్లా కలెక్టర్​ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
మ్యాన్​హోల్స్​లో మీథేన్​లో ఏదో రసాయనం కలసి ఉండొచ్చని.. దాని కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాతోందని వెల్లడించారు. అంతకుముందు.. డెయిరీ ప్లాంట్​ నుంచి గ్యాస్​ లీకైందని అంతా అనుకున్నారు.

పరిహారం ప్రకటించిన ప్రభుత్వం..
లూధియానా గ్యాస్ లీకేజీ ప్రమాదంలో మరణించిన వారికి 2 లక్షలు చొప్పున, గాయపడిన వారికి 50 వేల చొప్పున పరిహారం ప్రకటించింది పంజాబ్​ ప్రభుత్వం. ఈ మేరకు లుధియానా డిప్యూటీ కమిషనర్ సుర్భి మాలిక్ తెలిపారు.
ఈ ఘటనపై పంజాబ్​ ముఖ్యమంత్రి భగవంత్​ మాన్​ స్పందించారు. 'ఈ ఘటన చాలా బాధాకరం. పోలీసులు, ప్రభుత్వం, ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు ఘటనా స్థలంలో ఉన్నాయి.. అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తున్నారు' అని ట్వీట్ చేశారు.

ఒక్కసారిగా గ్యాస్ ​లీక్​.. 11 మంది మృతి.. ఇళ్లల్లోనే స్పృహ తప్పిన ప్రజలు!

భవనం కూలి నలుగురు మృతి..
మహారాష్ట్ర ఠాణెలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. భవన శిథిలాల నుంచి ఆదివారం ఓ మృతదేహాన్ని వెలికితీశారు. చనిపోయిన వ్యక్తి ఎవరో ఇంకా గుర్తించలేదు. ఈ ప్రమాదంలో గాయపడిని 12 మందిని ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వాల్పాడా ప్రాతంలోని వర్ధమాన్​ కాంపౌండ్​లో రెండంతస్తుల భవనం ఉంది. ఆ భవనంలో గ్రౌండ్​, మొదటి అంతస్తుల్లో గోదాము​ ఉంది. పైన అంతస్తులో నాలుగు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. శనివారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. సునిల్​ పిసా(38) అనే వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. గోదాములో ఉన్న కంటెయినర్​, ట్రాలీ ఆటోలు నలిగిపోయాయి. అయితే, దాదాపు 15 మంది దాకా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందే స్పందిచారు. ఈ ప్రమాదాన్ని అత్యంత దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. భీవండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ బాధితుడిని శిందే పరామర్శించారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Last Updated : Apr 30, 2023, 2:32 PM IST

ABOUT THE AUTHOR

...view details