తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Gas leak: ఫ్యాక్టరీ నుంచి గ్యాస్​ లీక్​.. భయాందోళనలో ప్రజలు - maharastra gas leak

మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో ఓ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్​ లీకైంది(gas leak). శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కళ్లలో మంటలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అగ్ని మాపక సిబ్బంది సకాలంలో స్పందించగా.. ప్రమాదం తప్పింది.

gas leakage
మహారాష్ట్రలో గ్యాస్​ లీకేజ్

By

Published : Jun 4, 2021, 3:54 AM IST

Updated : Jun 4, 2021, 6:42 AM IST

మహారాష్ట్ర, ఠాణె జిల్లాలోని బద్లాపుర్​లో ఓ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్​ లీక్ (gas leak)​అయ్యింది. రాత్రి 10.20 గంటల సమయంలో విడుదలైన గ్యాస్​.. సమీప ప్రాంతమంతా వ్యాపించింది.

శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు, కళ్లలో మంటలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అగ్ని మాపక సిబ్బంది సకాలంలో స్పందించి రాత్రి 11.24 గంటల వరకు గ్యాస్​ లీకేజ్​ను నిలిపేసింది. ఈ ఘటనలో ఎవరూ మరణించలేదని ఠాణె మున్సిపల్​ కార్పొరేషన్​ తెలిపింది.

Last Updated : Jun 4, 2021, 6:42 AM IST

ABOUT THE AUTHOR

...view details