Gas Cylinder Blast in Bakery at Rajendranagar Today :Gas Cylinder Blast in Bakery at Rajendranagar Today : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఓ బేకరీ వంటశాలలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బేకరీ(Bakery) యాజమాన్యం స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారిలో ఒకరు మృతి చెందగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మొదట గాయపడిన వారిని శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్య చికిత్స కోసం డీఆర్డీవో(DRDO) అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు రాబడుతున్నారు.
'ఉదయం 9గంటల సమయంలో కరాచీ బేకరికి చెందిన వంటశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓవెన్ నుంచి ఒక్కసారిగా మంటలు వెలువడటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు గాయపడ్డారు. అగ్నిప్రమాదం విషయం గోప్యంగా ఉంచిన కరాచీ బేకరీ యాజమాన్యం, అక్కడ ఉన్న వాహనాల్లో బాధితులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, అగ్నిప్రమాదంపై స్పందించి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించడంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యాజమాన్యం, సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుంచి తిరిగి' పోలీసులు వెళ్లిపోయారు.
తెలంగాణ పర్యాటక భవన్లో భారీ అగ్ని ప్రమాదం - అగ్నికి ఆహుతైన కీలక దస్త్రాలు, కావాలనే!