రాజస్థాన్‌లోని ఝున్ఝును జిల్లాకు చెందిన ఓ ఎల్పీజీ సిలిండర్ పంపిణీ కేంద్రం యజమానిని (pakistan spy arrested in india) పోలీసులు అరెస్టు చేశారు. సైన్యానికి చెందిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తుండమే ఇందుకు కారణం. నిందితుడిని నర్హర్ గ్రామానికి చెందిన సందీప్ కుమార్‌గా (30) పోలీసులు గుర్తించారు.
అధికారుల వివరాల ప్రకారం..
పాకిస్థాన్ గూఢచారులు.. భారత సైన్యం రహస్యాలు తెలుసుకునేందుకు సందీప్ కుమార్‌ను (pakistan spy agency) సంప్రదించారు. డబ్బు ఆశచూపి.. సైన్యానికి చెందిన వివరాలు కావాలని కోరారు. ఈ క్రమంలో.. సైనిక స్థావరాల సమీపంలో సిలిండర్లు డెలివరీ చేస్తూ కొంత సమాచారం తెలుసుకున్నాడు సందీప్. నర్హార్ ఆర్మీ బేస్‌కు చెందిన కొంత రహస్య సమాచారం సహా పలు ఫొటోలను కూడా పాక్ గూఢచారులకు పంపాడు.
ఈ విషయం తెలుసుకున్న నిఘా వర్గాలు దర్యాప్తు నిమిత్తం ఈనెల 12న నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. జులైలోనే పాకిస్థాన్ గూఢచారులు తనను సంప్రదించినట్లు సందీప్ వెల్లడించాడని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి.. కేసు నమోదు చేసిన అధికారులు, అతడిని గురువారం అరెస్టు చేశారు.
ఇదీ చూడండి :ఆపరేషన్ పోలోకు ముందే తెరవెనక యుద్ధం!