గార్లిక్ క్యాప్సూల్స్‌కు పెరుగుతున్న ఆదరణ రాజస్థాన్‌లోని కోటాకు చెందిన కృషి విజ్ఞాన కేంద్రం మహిళా సిబ్బంది వెల్లుల్లితో ఔషధాలను రూపొందిస్తున్నారు. డాక్టర్ మమతా తివారీ ఆధ్వర్యంలో ఎన్నో ఔషధ గుణాలు గల ఈ వెల్లుల్లితో క్యాప్సుల్స్‌ను రూపొందించారు. 500, 1000 మిల్లీగ్రాములుగా ఆన్లైన్లో లభించే వీటికి ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది.
గార్లిక్ క్యాప్సూల్స్‌కు పెరుగుతున్న ఆదరణ "వెల్లుల్లితో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటిలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అంతే కాదు, గార్లిక్‌తో బ్లడ్ కొలెస్ట్రాల్, కీళ్లనొప్పులు, క్యాన్సర్ వంటి సమస్యలను నివారించవచ్చు."
--డాక్టర్ మమతా తివారీ, కృషి విజ్ఞాన్ కేంద్రం
ఎండపెట్టిన వెల్లుల్లిని వలిచి వాటిని పొడిచేస్తామని సిబ్బంది తెలిపారు. కేజీ వెల్లుల్లితో 100 గ్రాముల పౌడర్ తయారు అవుతోందని, ఈ క్యాప్సుల్స్‌ను తయారు చేయడానికి 10 రోజుల సమయం పడుతుందని పేర్కొన్నారు. వెల్లుల్లి వాసనకు విరుగుడుగా అందులో జంతు పదార్థాల నుంచి సేకరించే ప్రొటీన్ (యానిమల్ జెలాటిన్) , బియ్యం పొట్టును ఉపయోగిస్తున్నారు. వీటి ధర రూ.1 నుంచి 3 రూపాయల మధ్య ఉంటుంది. బియ్యం పొట్టుతో తయారుచేసిన క్యాప్సుల్స్ ధర ఎక్కువ. ఈ గార్లిక్ క్యాప్సుల్స్ ధరలకు మార్కెట్లో వెల్లుల్లి ధరను బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయని సిబ్బంది తెలిపారు.
ఇదీ చదవండి :'ఆ భూముల క్రమబద్ధీకరణను హక్కుగా పొందలేరు'