Ganja Smuggling: ఛత్తీస్గడ్ రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లాలో డ్రగ్ రాకెట్ నడుపుతున్న పుఖ్రాజ్ వర్మను అరెస్టు చేశారు. అతని నుంచి 371 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.22 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితుడి సంబంధించిన పలు ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు.. రూ.12 లక్షల నగదు, 32 తులాల బంగారం కూడా లభించినట్లు తెలిపారు.
గంజాయి స్మగ్లింగ్ గుట్టు రట్టు- 375 కిలోలు స్వాధీనం - Ganja Smuggling
Ganja Smuggling: ఛత్తీస్‌గఢ్‌లో గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ.22 లక్షలు విలువైన 371 కిలోల గంజాయి, 12 లక్షల నగదు, 32 తులాల పసిడిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
![గంజాయి స్మగ్లింగ్ గుట్టు రట్టు- 375 కిలోలు స్వాధీనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14551088-thumbnail-3x2-ganja.jpg)
జిల్లాలో గంజాయి సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందిందని.. ఆ మేరకే తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ సంతోశ్ సింగ్ తెలిపారు. ఈ క్రమంలోనే గంజాయి రాకెట్ నడుపుతున్న పుఖ్రాజ్ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. తద్వారా గంజాయి రాకెట్‌ను ఛేదించడంలో పోలీసులు విజయం సాధించారని అన్నారు. నిందితుడిపై ఇప్పటికే 13 కేసులున్నట్లు తెలిపారు. జిల్లాలో అక్రమ మద్యం, గంజాయి రవాణాపై పోలీసులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారని.. ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'ఆ కుటుంబ పార్టీలకు ముస్లిం మహిళల కష్టాలు పట్టవా?'