తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏఎస్​ఐ గంజాయి దందా.. 420 కిలోలతో రెడ్​ హ్యాండెడ్​గా... - ఒడిశా ఏఎస్ఐ గంజాయి స్మగ్లింగ్ వార్తలు

Ganja smuggling: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఓ అసిస్టెంట్ సబ్ ​ఇన్​స్పెక్టర్​ను పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లర్లతో కలిసి గంజాయిని జిల్లా దాటించేందుకు ఏఎస్ఐ ప్రయత్నించాడని తెలిపారు.

ASI arrested ganja smuggling
420 కిలోల గంజాయి స్మగ్లింగ్.. పోలీసే నిందితుడు

By

Published : Mar 13, 2022, 7:47 PM IST

Ganja smuggling: ఒడిశా మల్కాన్​గిరిలో గంజాయి స్మగ్లింగ్​కు పాల్పడ్డాడనే ఆరోపణలతో ఓ అసిస్టెంట్ సబ్ ఇన్​స్పెక్టర్(ఏఎస్ఐ) అరెస్టు అయ్యాడు. నిందితుడిని జయదశ్ ఖారాగా గుర్తించారు.

ఏఎస్ఐ జయదశ్ ఖారా

Odisha ASI ganja smuggling

ఈ కేసుకు సంబంధించి ఏఎస్ఐతో పాటు మరో ముగ్గురు యువకులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 420 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఓ ల్యాప్​టాప్, రూ.10 వేల నగదు, రెండు బైక్​లను స్వాధీనం చేసుకున్నారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు

గంజాయి స్మగ్లింగ్​లో ఏఎస్ఐ పాత్ర ఉందన్న అనుమానాలతో.. మల్కాన్​గిరి పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. స్మగ్లర్లతో కుమ్మక్కై.. గంజాయిని జిల్లాను దాటిస్తున్నాడని గ్రహించారు. రెడ్ హ్యాండెడ్​గా పట్టుకునేందుకు పక్కా ప్రణాళికలు వేశారు. ఛత్తీస్​గఢ్​కు గంజాయి రవాణా చేస్తుండగా.. అరెస్టు చేశారు.

ఏఎస్ఐ

ఇదీ చదవండి:తిండి లేకుండా.. 'సోలార్ ఎనర్జీ'తో పాతికేళ్లు బతికిన వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details