తమిళనాడులోని చెన్నైకు చెందిన నలుగురు వ్యక్తులు ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్నారు. పండిన గంజాయిని పబ్బుల్లో, రిసార్టుల్లో విక్రయించి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సహా ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేశారు. నిందితులు ఈ మొక్కలను ఇంట్లోనే పెంచేందుకు విదేశాల పరికరాలను కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఓ ఇంజినీర్ మరో ముగ్గురు సహాయంతో ఈ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శక్తివేల్ అనే వ్యక్తి చెన్నైలో ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగంలో వచ్చిన డబ్బును శక్తివేల్ క్రిప్టోకరెన్సీగా మార్చుకుని వ్యాపారం చేసేవాడు. అతడు వ్యాపారంలో నష్టపోయాడు. దీంతో అక్రమంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేశాడు శక్తివేల్. ఇంట్లోనే గంజాయిని పండించాలని నిశ్చయించుకున్నాడు. గంజాయి సాగు కోసం యూట్యూబ్‌లో చూసి తెలుసుకున్నాడు. అలాగే డార్క్ వెబ్సైట్లో.. విదేశాల నుంచి కొరియర్ ద్వారా గంజాయిని పండించే పరికరాలు, విత్తనాలు కొనుగోలు చేశాడు.
ఆ తర్వాత మాడంబాక్కం ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని.. అందులో ఖరీదైన గంజాయి మొక్కలను పెంచడం ప్రారంభించాడు. ముఖ్యంగా ఇరుగుపొరుగు వారికి అనుమానం రాకుండా, గంజాయి వాసన రాకుండా అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశాడు. మొక్కలకు సూర్యరశ్మి తగలనందున ప్రత్యేక లైట్ సెట్టింగ్‌ను పెట్టాడు. అంతేకాకుండా పండిన గంజాయిని ప్రత్యేక పద్ధతుల్లో ఎండబెట్టి నాణ్యమైన గంజాయిగా తయారుచేసి విక్రయాలు జరిపేవాడు శక్తివేల్.
ఇంట్లోనే గంజాయి మొక్కల సాగు అయితే ఆన్లైన్లో వీటిని విక్రయించేందుకు రైల్వే ఉద్యోగులైన శ్యామ్ సుందర్, నరేంద్రకుమార్, శ్రీకాంత్‌ల సాయం తీసుకున్నాడు శక్తివేల్. వీరు ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు, పబ్బులను టార్గెట్ చేసుకుని గంజాయిని అమ్మేవారు. ఒక గ్రాము గంజాయిని రూ.1,000 నుంచి రూ.1,500 వరకు విక్రయించేవారు. గత 4 ఏళ్లుగా ఇంటి వద్ద గంజాయి మొక్కలను పెంచి విక్రయిస్తున్నట్లు పోలీసు విచారణలో వెల్లడించారు శక్తివేల్. శక్తివేల్ గంజాయి సాగు చేస్తున్న ఇంటిలో నుంచి 10కి పైగా గంజాయి మొక్కలు, 356 మందు బిళ్లలు, 3 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంట్లోనే గంజాయి మొక్కల సాగు గత కొంత కాలంగా పబ్బుల్లో, రిసార్టుల్లో గంజాయి, డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు రహస్యంగా దర్యాప్తు ప్రారంభించారు. ఆదే సమయంలో ఓ పబ్‌లో ఒక అనుమానుతుడిని పోలీసులు పట్టుకున్నారు. దీంతో అరెస్టయిన వ్యక్తిని విచారించగా మాడంబాక్కంలోని తలదాచుకున్న శక్తివేల్ గ్యాంగ్ గురించి పోలీసులకు వెల్లడించాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు శక్తివేల్ ముఠాను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.