తెలంగాణ

telangana

By

Published : Apr 25, 2023, 8:49 PM IST

Updated : Apr 25, 2023, 10:52 PM IST

ETV Bharat / bharat

'ఎన్​కౌంటర్ చేయకండి సార్​ లొంగిపోతా'.. ప్లకార్డ్​ పట్టుకుని పోలీస్ స్టేషన్​కు గ్యాంగ్​స్టర్​..

ఎన్​కౌంటర్ చేస్తారనే భయంతో ఓ గ్యాంగ్​స్టర్​ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. తానొక గ్యాంగ్​స్టర్​నని, షూట్​ చేయొద్దు.. అరెస్ట్​ చేయండి సార్​" అంటూ ప్లకార్డ్ చూపిస్తూ పోలీస్​ స్టేషన్​కు వెళ్లాడు. అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

gangster-surrender-in-up-gangster-surrender-before-police-with-pamphlet-fearing-of-encounter-in-uttarpradesh
చంపోద్దంటూ ఫామ్​ప్లేట్​ చూపిస్తూ.. పోలీసులకు లొంగిపోయిన గ్యాంగ్​స్టర్​

"నేనొక గ్యాంగ్​స్టర్​ని. నన్ను ఎన్​కౌంటర్ చేయకండి. అరెస్ట్​ చేయండి సార్​" అంటూ ప్లకార్డ్​ పట్టుకుని.. పోలీసుల ముందుకొచ్చాడు ఓ వ్యక్తి. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడు.. ప్లకార్డ్ పట్టుకుని వచ్చి పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయాడు. ​పోలీసుల ఎన్​కౌంటర్​ చేస్తారనే భయంతో ఇలా వారి ముందుకు వచ్చాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని సంభాల్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జాబుల్ అనే గ్యాంగ్​స్టర్​.. పోలీసులు ముందు ఈ తరహాలో లొంగిపోయాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న జాబుల్.. జిల్లాలోని హయత్​నగర్ పోలీస్​ స్టేషన్​లో​ లొంగిపోయాడు. జాబుల్​ హైబత్‌పుర్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతడు గోవు హత్యలతో పాటు.. చాలా నేరాల్లో పాల్గొన్నాడు. దీంతో జాబుల్​ను.. గ్యాంగ్​స్టర్​గా గుర్తిస్తూ కేసు నమోదు చేశారు ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు. నిందితుడు చాలా కాలంగా పోలీసులు నుంచి తప్పించుకుని తిరుగున్నాడు.

ఈ మధ్యకాలంలో యోగి ఆదిత్యనాథ్​ నేతృత్వంలోని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం.. గ్యాంగ్​స్టర్​లపై ఉక్కుపాదం మోపుతోంది. చాలా మంది గ్యాంగ్​స్టర్లు పోలీసుల ఎన్​కౌంటర్​లో చనిపోయారు. ఇలానే తనను కూడా చంపేస్తారనే భయంతో జాబుల్​ పోలీసులలకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. నిందుతుడిని అదుపులోకి తీసుకన్న అనంతరం కోర్టులో హాజరు పరిచినట్లు.. అదనపు పోలీసు సూపరింటెండెంట్ శ్రీష్ చంద్ర తెలిపారు. తరువాత అతడిని జైలుకు తరలించినట్లు ఆయన వెల్లడించారు.

పోలీసుల ముందు లొంగిపోయిన గ్యాంగ్‌స్టర్
పోలీసుల ముందు లొంగిపోయిన గ్యాంగ్‌స్టర్
గ్యాంగ్‌స్టర్ పట్టుకున్న ప్లకార్డు

ఎన్​కౌంటర్​ చేయకండి సార్​ లొంగిపోతా.. మెడలో బోర్డుతో పోలీస్​ స్టేషన్​కు పరుగులు..
కొంతకాలం క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. నేరాలకు పాల్పడితే ఎన్​కౌంటర్​ చేస్తామంటూ.. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ చేసిన హెచ్చరికలతో భయపడ్డ ఓ వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోయాడు. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆ వ్యక్తి.. మెడలో ఓ బోర్డు తగిలించుకుని పోలీస్​ స్టేషన్​కు వచ్చాడు. తాను లొంగిపోతానని, జీవితంలో మరోసారి నేరాలకు పాల్పడనని.. తనను ఎన్​కౌంటర్​ చేయొద్దని అట్టపైన రాసి మెడలో వేసుకున్నాడు. గాజియాబాద్​లో ఈ ఘటన జరిగింది.

లోని బోర్డర్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో 2022 సెప్టెంబర్​ 9న ఓ హత్య జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నాడు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అవసరమైతే నిందితుడిని ఎన్​కౌంటర్​ చేస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. దీంతో హడలిపోయిన నిందితుడు సొహైల్​.. తాను జీవితంలో మరోసారి నేరం చేయనని.. తనను ఎన్​కౌంటర్​ చేయవద్దని మెడలో బోర్డు తగిలించుకుని వచ్చి పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్​ చేయండి

Last Updated : Apr 25, 2023, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details