ముంబయి, చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన నేరాల్లో కీలక నిందితుడుగా ఉన్న పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ సురేశ్ పుజారి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. మంగళవారం అతడిని ఫిలిప్పీన్స్‌లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వర్గాలు తెలిపారు. ఠాణెలో ఎక్కువ కేసులు నమోదైనట్లు ఓ సీనియర్ అధికారి చెప్పారు. నిందితుణ్ని కస్టడీకి కోరినట్లు పేర్కొన్నారు.
ఈ అరెస్ట్‌పై ముంబయి పోలీసులు అధికారికంగా స్పందించలేదు. ఫిలిప్పీన్స్‌లోని ఓ వార్తా సంస్థ సురేశ్ బాసప్ప పుజారి అనే వ్యక్తిని పరానాక్ సిటీలో అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. చట్టవిరుద్ధంగా నిందితుడు దేశంలో ఉంటున్నట్లు రాసుకొచ్చింది.