Gangster Suresh Pujari: మహారాష్ట్ర, కర్ణాటకలో పలు దోపిడీ కేసుల్లో మోస్ట్ వాంటెడ్, 15 ఏళ్లుగా పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ సురేశ్ పూజారిని భారత్‌కు రప్పించారు అధికారులు. ఫిలిప్పీన్స్ నుంచి మంగళవారం రాత్రి భారత్‌కు తీసుకొచ్చినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్) పూజారిని దిల్లీలో బుధవారం తమ కస్టడీలోకి తీసుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఠాణె నగరంలో నమోదైన పలు కేసుల్లో విచారణ నిమిత్తం.. ముంబయికి తరలించినట్లు వెల్లడించారు.
మంగళవారం రాత్రి ఫిలిప్పీన్స్ నుంచి దిల్లీకి తీసుకొచ్చిన తర్వాత మొదటగా.. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), సీబీఐ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అప్పటికే.. దిల్లీ చేరుకున్న డీసీపీ రాజ్‌కుమార్ శిందే నేతృత్వంలోని ఏటీఎస్ బృందం.. పూజారిని కస్టడీలోకి తీసుకుని బుధవారం ఉదయం వాయుమార్గంలో ముంబయికి తీసుకొచ్చింది.
పూజారిని ముంబయికి తీసుకొచ్చిన తర్వాత.. కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరినట్లు చెప్పారు. ఏటీఎస్ కస్టడీ పూర్తయ్యాక.. రాష్ట్ర రాజధానిలో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా.. ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు అధికారులు.
పలు కేసుల్లో మోస్ట్‌వాంటెడ్..