కర్ణాటకలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మైసూర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్(mysore gangrape) జరిగింది. యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి చాముండి హిల్స్ ప్రాంతానికి వెళ్లిన సమయంలో పలువురు దుండగులు ఈ అమానుషానికి పాల్పడ్డారు.
ఏం జరిగిందంటే?
యువతి, తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మైసూరులోని చాముండి హిల్స్‌కు వెళ్లింది. అక్కడి నుంచి బైక్‌పై తిరిగి వస్తుండగా.. కొందరు యువకులు వారిని అడ్డగించారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి వద్ద పెద్దగా నగదు లేకపోవడం వల్ల.. దుండగులు దాడి చేశారు. యువతి బాయ్‌ఫ్రెండ్‌ను చితకబాదారు. లలితాద్రిపుర రహదారి వద్ద యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారాని సమాచారం. ప్రస్తుతం యువతి, యువకుడు ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఘటనపై విచారణ చేపట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. మైసూరు కమిషనర్ చంద్రగుప్త.. ఘటనాస్థలిని పరిశీలించారు. యువకులు బయటి నుంచి వచ్చారా? లలితాద్రిపుర హిల్స్‌లో వారు ఏం చేస్తున్నారు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆలనహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.