కరోనా కాలంలో పిల్లల్లో ఊబకాయం(Obesity in children) సమస్య పెరిగిపోయింది. దిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి(Sir ganga ram hospital) నిపుణులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అక్టోబరు 1 నుంచి 31 మధ్య ఆన్లైన్లో నిర్వహించిన ఈ సర్వే(Obesity in children) ఫలితాలను(Obesity in pandemic) ఆస్పత్రి వర్గాలు శనివారం విడుదల చేశాయి.
"60శాతం కంటే ఎక్కువ మంది తమ చిన్నారులు సాధారణ బరువు కంటే 10శాతం ఎక్కువ బరువు పెరిగారని తెలిపారు. ఇంట్లోనే ఎక్కువ సేపు కూర్చోవడం, సమయానికి ఆహారం దొరకడం కారణంగా కూడా పిల్లలు బరువు పెరగడానికి కారణమని చాలా మంది చెప్పారు. ఒత్తిడి, సరైన నిద్ర వేళలు లేకపోవడం వల్ల పిల్లలు బరువు పెరిగారని పేర్కొన్నారు."
-గంగా రామ్ ఆస్పత్రి వైద్యులు