తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నదీతీరమే తరగతి గది... ప్రభుత్వ ఉద్యోగార్థులకు ఫ్రీ కోచింగ్!

Ganga Ghat open classroom: ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం నదీతీరాన్నే ఓపెన్ క్లాస్​రూంగా మార్చేశారు. వారాంతాల్లో ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు మెరుగ్గా సన్నద్ధమయ్యేలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదంతా ఎక్కడ జరుగుతోందంటే?

Ganga Ghat open classroom
Ganga Ghat open classroom

By

Published : Apr 16, 2022, 7:39 PM IST

నదీతీరంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధం

Ganga Ghat open classroom: ఉద్యోగార్థుల కోసం గంగా తీరమే ఓపెన్ క్లాస్​రూంగా మారిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుకునే విద్యార్థులకు మంచి వేదిక అవుతోంది. బిహార్ పట్నాలోని గంగా కాలేజ్ ఘాట్​కు వందలాది మంది ఉద్యోగార్థులు చదువుకునేందుకు వస్తున్నారు. ఉచితంగా క్లాసులు చెప్తున్న నేపథ్యంలో బిహార్, ఉత్తర్​ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఔత్సాహికులు తరలి వస్తున్నారు. ఎస్​కే ఝా అనే ఇంజినీర్ ఉపాధ్యాయుడిగా మారి.. వీరందరి నుంచి ఎలాంటి రుసుం తీసుకోకుండానే క్లాసులు చెబుతున్నారు.

గంగా కాలేజ్ ఘాట్​లో విద్యార్థులు
నదీ తీరంలో విద్యార్థులు

patna ganga college ghat: ప్రస్తుతం 12 వేల నుంచి 14 వేల మంది ఔత్సాహికులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారని ఎస్​కే ఝా తెలిపారు. 'ఎక్కువ మంది విద్యార్థులు ఆర్ఆర్​బీ, ఎస్ఎస్​సీ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. వీరంతా ఎన్​టీపీసీ నిర్వహించే తొలి విడత పరీక్షలో అర్హత సాధించారు' అని వివరించారు. ఉచితంగా క్లాసులు చెప్పడమే కాకుండా.. వీరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 30-35 మందితో కూడిన బృందం ఆయనకు సహాయం అందిస్తోంది. వారానికి రెండుసార్లు ఈ విద్యార్థులకు క్లాసులు చెబుతున్నారు ఝా. ఉద్యోగాలకు ఎలా సన్నద్ధమవ్వాలనే విషయంపై మార్గదర్శనం చేస్తున్నారు.

.

ఎస్​కే ఝా చెప్పే విషయాలు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమయ్యేందుకు విశేషంగా ఉపయోగపడుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. 'రోజు ఉదయం 6గంటలకు ఇక్కడికి వస్తాను. 120 ప్రశ్నలతో కూడిన క్వశ్చన్​ పేపర్ ఇస్తారు. 90 నిమిషాల సమయంలో దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి' అని ఔరంగాబాద్​కు చెందిన ఓ విద్యార్థి చెప్పుకొచ్చాడు.

గంగా కాలేజ్ ఘాట్

ఇదీ చదవండి:నడిరోడ్డుపై మహిళ వీరంగం.. స్కూటీని ఢీకొట్టాడని​ యువకుడిపై దాడి

ABOUT THE AUTHOR

...view details