తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పండుగ రోజు బాలికలపై గ్యాంగ్​ రేప్.. బంధువులను కొట్టి..​. - గ్యాంగ్​ రేప్​

దసరా రోజున ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారానికి(gang rape) పాల్పడ్డారు దుండగులు. ఉత్సవాలు చూసి తిరిగి వస్తున్న క్రమంలో వెంట ఉన్న బంధువులను కొట్టి.. అక్కాచెల్లెల్లను(gang rape victim) అపహరించిన దుండగులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ సంఘటన ఝార్ఖండ్​లోని గుమ్లా జిల్లాలో జరిగింది.

gang rape
దసరా రోజు బాలికలపై గ్యాంగ్​ రేప్

By

Published : Oct 18, 2021, 5:39 PM IST

దసరా ఉత్సవాలను చూసేందుకు వెళ్లి వస్తున్న ఇద్దరు అక్కాచెల్లెల్లపై(gang rape victim) సామూహిక అత్యాచారానికి(gang rape) పాల్పడ్డారు దుండగులు. ఈ సంఘటన ఝార్ఖండ్​లోని గుమ్లా జిల్లాలో జరిగింది.

బిషున్​పుర్​ గురుదరి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు.. తమ బంధువులతో కలిసి శుక్రవారం సాయంత్రం దసరా ఉత్సవాలను చూసేందుకు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ప్రేమ్​ అనే యువకుడు అడ్డగించాడు. స్నేహితులతో కలిసి బాలిక బంధువులను కొట్టి వెళ్లగొట్టాడు. ఆపై వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

శనివారం తమకు ఫిర్యాదు అందినట్లు గుమ్లా సదర్​ ఎస్​డీపీఓ మనీశ్​ చంద్ర తెలిపారు. ఆ వెంటనే చర్యలు చేపట్టామని, బాలికలను వైద్య పరీక్షల కోసం గుమ్లా ఆసుపత్రికి తరలించామన్నారు. నిందితుల్లో పలువురు చాపాకోనా గ్రామానికి చెందిన వారిగా తెలిసిందని చెప్పారు. ఈ సంఘటనపై సమాచారం తెలిసిన క్రమంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆగ్రహానికి గురయ్యారని, నిందితులను పట్టుకునేందుకు సోదాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ఒకరిని అరెస్ట్​ చేసినట్లు గుమ్లా ఎస్పీ ఎహ్​తేశామ్​ వకారీబ్​ తెలిపారు. ఆయా గ్రామాలు నక్సల్​ ప్రభావిత ప్రాంతంలో ఉన్నట్లు తెలిపారు.

నిందితుల్లో ఒకరు ఆత్మహత్య!

బాలికలపై అత్యాచారం కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్​డీపీఓ తెలిపారు. అత్యాచారంపై కోపోద్రిక్తులైన గ్రామస్థులు నిందితులను పట్టుకునేందుకు సమావేశమయ్యారని, అందులో అతను కూడా ఉన్నాడని చెప్పారు. యువకుడిని గ్రామస్థులు అనుమానించిన క్రమంలో ఇంటికి వెళ్లి ఉరి వేసుకున్నాడని తెలిపారు. ఆరోపణల వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుడి తండ్రి ఫిర్యాదు ఇచ్చినట్లు చెప్పారు ఎస్​డీపీఓ.

ఇదీ చూడండి:యువతిపై గ్యాంగ్​ రేప్​.. హత్య చేసేందుకు తీసుకెళ్తూ...

ABOUT THE AUTHOR

...view details