Gang rape on minor girl: దేశంలో బాలికలు, మహిళలపై మానవ మృగాల ఆకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఓ పదో తరగతి విద్యార్థినిని అపహరించి, మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఈ దుర్ఘటన ఉత్తర్ప్రదేశ్ ముజఫర్నగర్లో గురువారం జరిగింది.
బాలిక ట్యూషన్ క్లాసులకు వెళ్లి తిరిగివస్తోంది. అక్కడే కాపు కాసిన ఇద్దరు దుండగులు ఆమెను అపహరించి సదపుర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మరో ఇద్దరు వేచి ఉన్నారు. బాలికకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
బాలిక ఇంటికి రాకపోవటం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు. పోలీసులు, బంధువులు స్థానిక ప్రాంతాల్లో వెతకగా.. అపస్మారక స్థితిలో బాలిక కనిపించింది. మత్తు నుంచి తేరుకున్నాక తనపై జరిగిన దుశ్చర్యను కుటుంబ సభ్యులకు వివరించింది బాలిక.
నలుగురిపై కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు స్థానిక జన్సాథ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ బబ్లూ సింగ్ వర్మ. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.