తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జాబ్ ఇప్పిస్తానని నమ్మించి.. యువతిపై సామూహిక అత్యాచారం - ఏడేళ్ల దివ్యాంగ బాలికపై రేప్

Gang Rape In Rajasthan: ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు యువకులు. రాజస్థాన్​లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరో ఘటనలో కార్టూన్ సినిమాలు చూపిస్తానని పొలంలోకి తీసుకెళ్లి ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు.

Gang Rape in Churu
జాబ్ ఇప్పిస్తానని నమ్మించి

By

Published : Feb 12, 2022, 7:53 PM IST

Updated : Feb 12, 2022, 8:58 PM IST

Gang Rape In Rajasthan: రాజస్థాన్​ చురు జిల్లాలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ​ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు యువకులు. అత్యాచారం అనంతరం యువతి చేతులు, కాళ్లు కట్టేసి భవనం పైనుంచి కిందకు పడేశారు. లక్కీగా తాడు భవనంలోని స్తంభానికి ఇరుక్కోవడం వల్ల ఆమె ప్రాణాలతో భయటపడింది. స్థానికులు ఫిర్యాదులో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను కిందకు దింపి ఆస్పత్రికి తరలించారు.

"రాజు అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్తే దిల్లీ నుంచి రాజస్థాన్​లోని చురుకు వచ్చాను. ఆ తర్వాత నన్ను ఓ గదికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు."అని బాధితురాలు పోలీసుల ముందు విలపించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కార్టూన్ సినిమాలు చూపిస్తానని..

రాజస్థాన్​ ఛిత్త్తోర్​గఢ్​ జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. ఏడేళ్ల దివ్యాంగ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి వంటపనిలో నిమగ్నమై ఉండగా.. తండ్రి పనిమీద బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో కార్టూన్ సినిమాలు చూపిస్తానని పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక సోదరుడు తల్లిదండ్రులకు చెప్పాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు మనోజ్ జాకర్​(19)ను అదుపులోకి తీసుకున్నారు.

అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

మతిస్థిమితం లేని మహిళపై..

మహారాష్ట్రలోని పాల్​ఘడ్ జిల్లాలో విషాదకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. దప్చారీ సుతార్​పదా ప్రాంతంలో ఓ వక్తి ఐదు నెలలుగా మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. సదరు మహిళ గర్భం దాల్చడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి:పైనుంచి రైలు.. ట్రాక్​ మధ్యలో నక్కి బాలికను కాపాడిన యువకుడు

Last Updated : Feb 12, 2022, 8:58 PM IST

ABOUT THE AUTHOR

...view details