తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిద్రిస్తున్న మహిళను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం - ఐదేళ్ల చిన్నారిపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారం

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ హమీర్​పుర్​లో జరిగింది. రాజస్థాన్​లో జరిగిన మరో ఘటనలో అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు మహిళను సజీవ దహనం చేశారు.

gang rape in hamirpur
gang rape in hamirpur

By

Published : Aug 17, 2022, 2:01 PM IST

ఉత్తర్​ప్రదేశ్​​ హమీర్​పుర్​లో దారుణం జరిగింది. మహిళపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో నిద్రిస్తున్న మహిళను ఎత్తుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన కొత్వాలి పరిధిలోని మౌదహా గ్రామంలో జరిగింది. కాగా, ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు. ఈ విషయం సోషల్​ మీడియాలో వైరల్​ కావడం వల్ల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

హమీర్​పుర్​ గ్రామానికి చెందిన బాధితురాలి భర్త.. మరో ప్రాంతంలో పనిచేస్తున్నాడు. దీంతో బాధితురాలు.. అత్తతో కలిసి ఉంటోంది. ఆగస్టు 11న నిద్రపోతున్న సమయంలో ఐదుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. మహిళ నిద్రిస్తున్న గదిలోకి వచ్చి.. ఆమెను బలవంతంగా మరో గదికి ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించగా.. చంపేస్తామంటూ తుపాకీతో బెదిరించారు. అనంతరం దుండగులు అక్కడినుంచి పరారయ్యారు.

మహిళ సజీవ దహనం.. అప్పు తిరిగి ఇవ్వమనడమే కారణం: రాజస్థాన్​ జైపుర్​లో దారుణం జరిగింది. అప్పు తిరిగి ఇవ్వమని అడిగినందుకు మహిళను సజీవ దహనం చేశారు. మహిళపై పెట్రోల్​ పోసి నిప్పంటించగా.. చుట్టూ ఉన్న వారందరూ ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. అనంతరం మహిళను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

బాధిత మహిళ స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. పొరుగున ఉన్న వారికి కొంత నగదును అప్పుగా ఇచ్చింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా.. ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఆగస్టు 10న స్కూల్​కు వెళ్తున్న మహిళపై.. అందరూ చూస్తుండగానే పెట్రోల్​ చల్లి నిప్పంటించారు దుండగులు. అనంతరం తీవ్ర గాయాలపాలైన మహిళను స్వామి మాన్​సింగ్​ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించింది. అంతకుముందే ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

ఐదేళ్ల చిన్నారిపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారం: కర్ణాటక హుబ్లీలో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు 15 ఏళ్ల బాలుడు. చిన్నారి బయట ఆడుకుంటుండగా.. చాక్లెట్​ ఇస్తానంటూ నమ్మించిన బాలుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం చిన్నారిని కిమ్స్​ ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి:రూ 500 కోసం స్నేహితుల గొడవ, కత్తితో తలనరికి పోలీస్​ స్టేషన్​కు

చిన్నారుల స్కూల్​ బస్సుపై దుండగుల దాడి, పదునైన ఆయుధాలతో

ABOUT THE AUTHOR

...view details