తెలంగాణ

telangana

ETV Bharat / bharat

14 ఏళ్ల బాలికపై గ్యాంగ్​ రేప్​- 9 మంది అరెస్ట్​! - సామూహిక అత్యాచారం

Gang rape in Gujarat: స్నేహితుడేనని నమ్మి వెళ్లినందుకు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో బాలుడు. అంతటితో ఆగకుండా 8 మంది తన స్నేహితులకు అప్పగించాడు. ఫోన్లో చిత్రీకరించి సోషల్​ మీడియోలో షేర్​ చేశాడు. ఈ దుశ్చర్య రెండు నెలల క్రితం గుజరాత్​లోని డాంగ్​ జిల్లాలో జరగగా.. ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Gang rape in Gujarat
గ్యాంగ్​ రేప్​

By

Published : Dec 26, 2021, 4:18 PM IST

Gang rape in Gujarat: గుజరాత్​లోని డాంగ్​ జిల్లాలో ఓ 14 ఏళ్ల బాలికపై స్నేహితులే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటనకు సంబంధించి.. ఆరుగురిని అరెస్ట్​ చేసి, మరో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఈ సంఘటన రెండు నెలల క్రితం జరిగింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోను బాధితురాలి బంధువు చూసి కుటుంబ సభ్యులకు తెలియజేయగా బయటకు వచ్చింది.

" బాధితురాలు.. రెండు నెలల క్రితం పక్క ఊరిలో ఓ వివాహానికి హాజరై ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఆమె మైనర్​ స్నేహితుడు ముందు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వచ్చే దారిలో ఉన్న బాలుడి 8 మంది స్నేహితులు బాలికను సమీపంలోని అటవీ ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడ ఇద్దరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తొమ్మిది మంది నిందితుల్లో ఆరుగురు 20 ఏళ్లవారు కాగా.. ముగ్గురు మైనర్లు. నిందితుల్లో ఒకడు తన మొబైల్​ ఫోన్లో వీడియో తీశాడు. ఆ తర్వాత అటుగా వస్తున్న కొందరిని చూసి పారిపోయారు."

- ఎన్​హెచ్​ సవ్సేత, ఎస్సై.

ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని పారిపోయే ముందు బాలికను బెదిరించారని ఎస్సై తెలిపారు. భయపడిపోయిన బాలిక రెండు నెలల వరకు ఎవరికీ చెప్పలేదు. ఇటీవల ఆమె బంధువు ఒకరు ఆ వీడియోను చూసి కుటుంబ సభ్యులకు తెలిపాడని, ఆ తర్వాత వారు పోలీసులను ఆశ్రయించగా డిసెంబర్​ 23న ఎఫ్​ఐఆర్​ నమోదైనట్లు చెప్పారు.

నిందితులు 9 మందిని డిసెంబర్​ 24న అరెస్ట్​ చేసినట్లు చెప్పారు ఎస్సై. ముగ్గురు మైనర్లు వారి సంరక్షకుల హామీతో బెయిల్​ పొందారని, మిగిలిన ఆరుగురిని కోర్టు ఆదేశాల మేరకు పోలీస్​ కస్టడీకి తరలించినట్లు చెప్పారు. నిందితులపై ఐపీసీ సెక్షన్​ 376(డీ)(ఏ), 506(2), 120(బీ), 114 సహా పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం.. చెరుకు తోటలో మృతదేహం!

ABOUT THE AUTHOR

...view details