తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యువతిని ఎత్తుకెళ్లి.. కారులో తిప్పుతూ అత్యాచారం! - బెంగళూరు కోరమంగళ లేటెస్ట్ న్యూస్​

ఓ యువతిని నలుగురు యువకులు కలిసి కారులో ఎత్తుకెళ్లి, అత్యాచారం చేశారు. ఈ ఘటన ఈనెల 25న బెంగళూరులో జరిగింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 31, 2023, 2:05 PM IST

Updated : Mar 31, 2023, 2:27 PM IST

కర్ణాటకలో దారుణం జరిగింది. నలుగురు కామాంధులు కదులుతున్న కారులో ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పార్క్​లో స్నేహితుడితో మాట్లాడుతున్న యువతిని కారులోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారా నిందితులు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన మార్చి 25న జరగగా ఆలస్యంగా వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
మార్చి 25న రాత్రి 10 గంటల సమయంలో.. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఉన్న నేషనల్​ గేమ్స్ పార్క్​లో.. ఓ యువతి తన స్నేహితుడితో కలిసి మాట్లాడుతోంది. అదే సమయంలో అక్కడకు కారులో వచ్చిన నలుగురు యువకులు వారిని చూశారు. వెంటనే వారి దగ్గరకు వెళ్లి ఆమె స్నేహితుడ్ని భయపెట్టి అక్కడ నుంచి పంపించేశారు. ఆ తర్వాత ఆ నలుగురు ఆమెను బలవంతంగా వారి కారులో ఎక్కించారు. అనంతరం దొమ్మలూరు, ఇందిరానగర్, అనేకల్, నైస్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో కారులో తిరుగుతూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రంతా కారుతో రోడ్లపై చక్కర్లు కొట్టిన వారు.. తెల్లవారుజామున 4 గంటల సమయంలో బాధితురాలిని తన ఇంటి సమీపంలో విడిచిపెట్టారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని బెదిరించారు.

యువతిని గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందిన తర్వాత బాధితురాలు తనపై జరిగిన అత్యాచారం గురించి కోరమంగళ పోలీస్​ స్టేషన్​లో ఈనెల 26న ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సతీశ్​, విజయ్, శ్రీధర్, కిరణ్ అనే నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అయితే నిందితులు, బాధితురాలు ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బాధితురాలికి సంబంధించి మెడికల్​ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉందని డీసీపీ సీకే బాబా తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందని ఆయన వెల్లడించారు.

మహిళా రోగిపై అత్యాచారం..
ఇటీవలే కలబురగి జిల్లాలో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళా రోగిపై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. అక్రమంగా మహిళల వార్డులోకి ప్రవేశించిన నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కలబురగికి చెందిన మహాబూబ్​ పాషా అనే వ్యక్తి మార్చి 14న రాత్రి సమయంలో గుల్బర్గాలోని జీఐఎమ్​ఎస్​ ఆస్పత్రికి వెళ్లాడు. ఆస్పత్రిలో అటూ ఇటూ తిరిగిన అతడు.. చివరికి మహిళల వార్డులోకి ప్రవేశించాడు. అనంతరం అక్కడ చికిత్స పొందుతున్న 36 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన పక్క వార్డులోని ఓ రోగి.. నిందితుడిని పట్టుకుని గట్టిగా కేకలు వేశాడు. అరుపులు విని అక్కడికి చేరుకున్న ఆస్పత్రి సిబ్బంది.. జరిగిన విషయాన్ని తెలుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రి వద్దు చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.

Last Updated : Mar 31, 2023, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details