Bangalore Girl Gang Rape: కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ బాలిక(16)పై ఎనిమిది మంది అత్యాచారానికి పాల్పడ్డారు. బెంగళూరులోని యెలహంక ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. ఘటనను వీడియో తీసి బాలికపై బెదిరింపులకు పాల్పడ్డారు నిందితులు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
ఓ రోజు బాలిక ఏడుస్తూ ఇంటికి రాగా.. తల్లిదండ్రులు ప్రశ్నించారు. అయితే.. భయంతో కాబాబ్లో కారం కారణంగా ఏడిచానని తెలిపింది బాలిక. కానీ ఆలస్యంగా బాలిక నుంచి సమాధానం రాబట్టిన తల్లిదండ్రులు.. అసలు విషయాన్ని తెలుసుకున్నారు. యెలహంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.