ఇంట్లోకి చొరబడి ఓ మహిళపై అత్యాచారం చేశారు దుండగులు. ఆపై ఎవరికైనా చెబితో చంపేస్తామని బెదిరించారు. రెండు రోజుల అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన రాజస్థాన్లోని సీరోహీ జిల్లాలో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం..రోహిడా పోలీస్ స్టేషన్ పరిధిలో బాధిత మహిళ నివాసం ఉంటోంది. దొంగతనం కోసం ఆమె ఇంట్లోకి బుధవారం నలుగురు నిందితులు చొరబడ్డారు. అనంతరం వెండి ఆభరణాలు, రూ.1400 నగదును దొంగతనం చేశారు. బాధితురాలి భర్తను బంధించి.. అతడి కళ్ల ముందే భార్యను అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు దుడంగులు. భయంతో రెండు రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాలేదు బాధితురాలు. రెండ్రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
పొగాకు తీసిన ప్రాణం..
పొగాకు కోసం డబ్బులివ్వలేదని ఓ వ్యక్తిని చంపేశారు ఇద్దరు దుండగులు. చనిపోయిన వ్యక్తిని మక్తా అలియాస్ సుభాస్ శక్యాగా గుర్తించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగింది.
ఇదీ జరిగింది.. సుభాస్ శక్యా అనే యువకుడు పొగాకు కొనడానికి ఓ దుకాణానికి వెళ్లాడు. అనంతరం డబ్బులు ఇవ్వకుండా పారిపోయే ప్రయత్నం చేశాడు. శక్యాను వెంబడించిన షాపు ఓనర్ కరణ్ యాదవ్, అతడి కుమారుడు సచిన్ యాదవ్.. శక్యాను పట్టుకున్నారు. ఆగ్రహించిన కరణ్ యాదవ్.. పిడిగుద్దులతో అతడిపై దాడి చేశాడు. దీంతో శక్యా అక్కడిక్కడే మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.