రాజస్థాన్ జైపుర్‌లోని జువెనైల్ హోమ్‌లో దారుణం జరిగింది. ట్రాన్స్‌పోర్ట్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జువెనైల్ హోమ్‌లో ఉంటున్న ఐదుగురు ఖైదీలు.. తోటి ఖైదీలపై దాడి చేశారు. అనంతరం అసహజ రీతిలో అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైన చెబితే తీవ్రమైన పరిస్థితులు ఎదురుకోవాల్సి వస్తుందని బాధితులను బెదిరించారు. బుధవారం ఈ విషయం జైలు అధికారుల దృష్టికి వచ్చింది. వారు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం...
జువనైల్ హోమ్‌లో ఉంటున్న ఖైదీ నెంబర్ 256... రాత్రి తన గదిలో నిద్రపోతున్నాడు. అదే సమయంలో ఐదుగురు వ్యక్తులు గదిలోకి ప్రవేశించారు. ఖైదీ నెంబర్ 256ను బంధించి ప్యాంట్‌ను చింపేశారు. అనంతరం అతనిపై వికృత చర్యకు పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే ఇంతకంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 266వ నెంబర్ ఖైదీ సైతం గత కొద్ది రోజులుగా ఆ ఐదుగురు తనపైన పలుమార్లు దాడి చేసి అత్యాచారం చేశారని చెప్పాడు. కాగా బాధితులు ఇద్దరు అల్వార్ ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు.