మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో టాయిలెట్ విషయంలో వివాదం తలెత్తి ఓ కుటుంబంపై మరో కుటుంబానికి చెందిన సభ్యులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. అయితే తమ పొలంలో మలవిసర్జన చేయొద్దన్నందుకే దాడి చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు.
ఇదీ జరిగింది.. జిల్లాలోని అమంచి తండా గ్రామంలో దేవిలాల్ సిల్లోడ్ కుటుంబానికి కొంత పొలం ఉంది. అదే గ్రామానికి చెందిన శిందే కుటుంబంలోని కొందరు పిల్లలు సిల్లోడ్ కుటుంబానికి చెందిన పొలంలోనే నిత్యం మలవిసర్జన చేస్తుంటారు. అయితే దీనిని సిల్లోడ్ కుటుంబసభ్యులు వ్యతిరేకించారు. తమ పొలంలో టాయిలెట్‌కు రావొద్దని హెచ్చరించారు.