దేశవ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలు దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొవిడ్ ఆంక్షల నడుమ భక్తులు తెల్లవారుజాము నుంచే పూజలు ప్రారంభించారు.
ముంబయిలోని 'లాల్ భాగ్ ఛా' గణపతి హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు నిర్వాహకులు. నాగ్ పుర్లోని లంబోదర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
ముంబయిలోని లాల్ భాగ్ ఛా వినాయక మందిరంలో భక్తులు ముంబయిలోని లాల్ భాగ్ ఛా వినాయకుడు నాగ్‌పుర్‌లో పూజలందుకుంటున్న వినాయకుడు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 'కరోనాపై పోరులో గణేశుడు విజయం కలిగించాలని.. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. 'ప్రజలందరికీ గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి, అదృష్టం, ఆరోగ్యం కలిగాలని గణేశుని వేడుకుంటున్నా' అని ప్రధాని ట్వీట్ చేశారు.
ప్రత్యేక వినాయక విగ్రహాల సందడి..
వినాయక చవితిని పురస్కరించుకుని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. 7వేలకు పైగా గవ్వలు, శంఖాలు ఉపయోగించి గణేశుని రూపాన్ని ఆవిష్కరించారు. కొవిడ్ మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఒడిశాలోని పూరీకి చెందిన శాశ్వత్ సాహూ అనే కళాకారుడు అగ్గిపుల్లలతో వినాయక ప్రతిమను రూపొందించాడు. మొత్తం 5,621 అగ్గిపుల్లలతో 23 అంగుళాల పొడవు, 22 అంగుళాల వెడల్పు గల విగ్రహాన్ని తయారు చేశాడు. ఇందుకు 8 రోజులు పట్టిందని తెలిపాడు.
అగ్గిపుల్లలతో వినాయకుని ప్రతిమ చాక్లెట్ గణపతిని రూపొందించాడో బేకరీ నిర్వాహకుడు. పంజాబ్ లూథియానాకు హర్జీందర్ సింగ్ కుక్రేజా అనే వ్యక్తి డార్క్ చాక్లెట్‌తో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలిపాడు. 2015 నుంచి పర్యావరణ అనుకూల వినాయకుడిని పూజిస్తున్నట్లు పేర్కొన్నాడు.
ఇవీ చదవండి: