Ganesh Chaturthi 2023 Why Should Not See Moon on Vinayaka Chavithi Day: వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదని పెద్దలు చెబుతారు. మరి, ఎందుకు చూడకూడదు? అసలు దాని వెనుక ఉన్న కారణం ఏంటి..? ఒకవేళ చంద్రుడిని చూస్తే.. ఎలాంటి పరిహారాలు చేయాలి..? వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
వినాయకుడు విఘ్నాలకు అధిపతి అన్న విషయం మనకు తెలిసిందే. భాద్రపద శుద్ధ చవితినాడే.. గజాననునికి విఘ్నాధిపత్యం ఇస్తాడు మహాశివుడు. ఈ ఉత్సవం వేళ.. సర్వదేశస్థులూ విఘ్నేశ్వరునికి కుడుములు, ఉండ్రాళ్లు మొదలైన పిండివంటలు.. ఇంకా టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలైనవన్నీ సమర్పించి పూజిస్తారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై.. కడుపు నిండా ఆరగిస్తాడు. మూషిక వాహనానికి కూడా మరికొన్ని ఇస్తాడు. మిగిలినవి తన చేతపట్టుకొని.. సూర్యాస్తమయ వేళకు తల్లిదండ్రుల వద్దకు కైలాసానికి వెళ్తాడు.
అక్కడ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించబోతాడు గణపతి. కానీ.. పొట్ట నిండుగా ఉన్న కారణంగా.. తల్లిదండ్రుల పాదాలను అదుకోలేక ఇబ్బంది పడుతుంటాడు. వినాయకుడి అవస్థచూసి.. చంద్రుడు హేళనగా నవ్వుతాడు. చంద్రుడి దృష్టిసోకి.. విఘ్నదేవుని ఉదరం పగిలి, లోపలున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడతాయి. వినాయకుడు మరణిస్తాడు. దాంతో పార్వతి ఉగ్రరూపంతో చంద్రుని చూసి.. "పాపాత్ముడా.. నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు. కాబట్టి నిన్ను చూసినవారంతా పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక" అని శపిస్తుంది.
ఆ సమయంలో చంద్రుడిని చూసిన వారంతా.. నిందలు మోయాల్సి వస్తుంది. సాక్షాత్తూ శ్రీకృష్ణుడు కూడా శమంతకమణిని అపహరించాడనే నింద పడాల్సి వస్తుంది. ఇలా ముల్లోకాల్లో ఉన్న వారంతా నీలాపనిందలు మోస్తారు. ఈ క్రమంలోనే.. బ్రహ్మ కైలాసానికి వచ్చి, మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బతికిస్తాడు. ఆ తర్వాత దేవతలంతా.. "పార్వతీ.. నీ శాపంవల్ల ముల్లోకాలకూ కీడు వాటిల్లుతోంది. ఉపసంహరించుకో" అని ప్రార్థిస్తారు. కానీ.. పార్వతి ఒకసారి శపిస్తే.. దాన్ని వెనక్కు తీసుకోవడం అనేది జరగదు. అందుకే.. శాపాన్ని పూర్తిగా తొలగించకుండా.. సడలింపు ఇస్తుంది. ప్రతిరోజూ కాకుండా.. "వినాయక చవితినాడు చంద్రుడిని చూసిన వారు మాత్రమే.." అంటూ శాప తీవ్రతను తగ్గిస్తుంది.
మరి.వినాయక చవితి రోజున అనుకోకుండా చంద్రుడిని చూస్తే.. ఎలా? అన్నది చాలా మందిని వేధించే ప్రశ్న. నిందలు పడాల్సి వస్తుందని కంగారు పడతారు. అయితే.. ఈ దోషం తొలగిపోవాలంటే ముందుగా గణపతిని పూజించి, పూలు, పండ్లు సమర్పించి చంద్రుడికి చూపించి పేదవారికి దానం ఇవ్వాలట. అదే సమయంలో.. భవిష్యత్తులో అపవాదులు రాకుండా ఉండటానికి, పూర్తి భక్తి , విశ్వాసంతో..
"సింహః ప్రసేన మవధీః సింహా జాంబవకా హతః