2020 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతిని.. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్‌కు ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ విషయాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2019 ఏడాదికి ఈ అవార్డును ఒమన్ మాజీ సుల్తాన్ దివంగత 'కాబూస్ బిన్ సయిద్ అల్ సయిద్'కు అందిస్తున్నట్లు తెలిపింది.
బంగ్లా జాతిపితకు గాంధీ శాంతి బహుమతి - గాంధీ శాంతి బహుమతి వార్తలు
2019, 2020 సంవత్సరాలకు గాంధీ శాంతి బహుమతి గ్రహీతలను ప్రకటించింది కేంద్రం. 2019 ఏడాదికి ఒమన్ మాజీ సుల్తాన్ కాబూస్ బిన్ సయిద్ అల్ సయిద్, 2020 ఏడాదికి బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ను విజేతలుగా ఎంపిక చేసింది.
ముజిబుర్, కాబూస్లకు గాంధీ శాంతి బహుమతి
1995 నుంచి గాంధీ శాంతి బహుమతులను అందిస్తోంది కేంద్రం. 125వ గాంధీ జయంతి సందర్భంగా ఈ పురస్కారాల ప్రదానం ప్రారంభించింది.