తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గాంధీ వర్ధంతి- రాజ్​ఘాట్ ​వద్ద ప్రముఖుల నివాళి - gandhi death news latest

Gandhi Death Anniversary: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. గాంధీజీ ఆశయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలని ప్రధాని పిలుపునిచ్చారు.

Gandhi Death Anniversary
గాంధీ వర్ధంతి

By

Published : Jan 30, 2022, 11:14 AM IST

Updated : Jan 30, 2022, 11:44 AM IST

Gandhi Death Anniversary: మహాత్మాగాంధీ 74వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ నివాళులు అర్పించారు. రాజ్​ఘాట్​లోని గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నమస్కరించారు.

రాజ్​ఘాట్​లో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ నివాళులు
రాజ్​ఘాట్​లో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్

ప్రధాని మోదీ ట్వీట్

జాతిపిత, మహాత్మాగాంధీ 74వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్రమోదీ. మహాత్ముడి గొప్ప ఆలోచనలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు సమష్టిగా ప్రయత్నించాలన్నారు.

"బాపూ వర్ధంతిని గుర్తుచేసుకుంటున్నాం. మహాత్ముడి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ ప్రయత్నించాలి. ఈరోజు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వీరులకు నివాళులు. వారి సేవలు, ధీరత్వాన్ని ప్రతిసారీ గుర్తుచేసుకుంటాం."

-- ప్రధాని నరేంద్రమోదీ

రాహుల్ నివాళులు..

రాహుల్​గాంధీ ట్వీట్
రాజ్​ఘాట్​లో గాంధీ సమాధికి నమస్కరిస్తున్న రాహుల్
రాజ్​ఘాట్​లో రాహుల్ నివాళులు

జాతిపిత మహాత్మాగాంధీ 74వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. నిజం ఎక్కడ ఉంటుందో అక్కడ బాపూ ఉంటారని అన్నారు.

"ఓ హిందుత్వవాది గాంధీని చంపాడు. హిందుత్వవాదులంతా గాంధీజీ లేరని అనుకుంటారు. కానీ ఎక్కడైతే నిజం ఉంటుందో అక్కడ గాంధీ ఉంటారు."

-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

షా నివాళులు..

గాంధీజీ పెయింటింగ్ ఆవిష్కరించిన అమిత్ షా
గోడపై గాంధీజీ పెయిటింగ్

గాంధీ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్​ షా నివాళులు అర్పించారు. అహ్మదాబాద్​లోని సబర్మతి రివర్ ఫ్రంట్​లో గాంధీపెయింటింగ్​ను ఆవిష్కరించారు.

" మహాత్మాగాంధీ స్వదేశీ, స్వభాషా, స్వరాజ్ స్ఫూర్తిని ప్రజల్లో నింపారు. మహాత్ముడి ఆలోచనలు, ఆశయాలు ఎల్లప్పుడూ ప్రతి భారతీయుడిలో స్ఫూర్తిని నింపుతాయి."

-- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:మహాత్ముడి వర్ధంతి: సత్యాగ్రహ నినాదం- నిశ్శబ్ద పోరాటం

Last Updated : Jan 30, 2022, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details