కరోనా రోగుల చికిత్సలో ఉపయోగించే ఫాబిఫ్లూ ఔషధాలను భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్‌కు చెందిన ఫౌండేషన్ అనధికారంగా నిల్వ చేసిందని దిల్లీ హైకోర్టుకు.. దిల్లీ ప్రభుత్వ ఔషధ నియంత్రణ అధికారి తెలిపారు. అనధికారంగా ఔషధాలను సేకరించి పంపిణీ చేసినట్లు తేలిందని స్పష్టం చేశారు. ఆలస్యం చేయకుండా గంభీర్ ఫౌండేషన్‌పై చర్యలు తీసుకుంటామని కోర్టుకు వివరించారు.
ఆప్ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ సైతం ఇదే తరహా నేరానికి పాల్పడ్డారని కోర్టుకు తెలిపారు దిల్లీ డ్రగ్ కంట్రోలర్. తమ దృష్టికి వచ్చిన ఇలాంటి కేసులన్నింటిపైనా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కేసుల పురోగతిపై ఆరు వారాల్లోగా తమకు నివేదిక అందజేయాలని డ్రగ్ కంట్రోలర్‌ను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణనను జులై 29కి ధర్మాసనం వాయిదా వేసింది.