తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గల్వాన్​' వీరులకు కేంద్రం పురస్కారాలు! - కర్నల్​ సంతోష్ బాబు

గల్వాన్​ ఘటనలో మృతిచెందిన జవాన్లకు కేంద్రం మరణాంతర సైనిక పురస్కారాలు అందించనుంది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో గతేడాది జూన్​ 15న జరిగిన ఈ ఘటనలో 20మంది సైనికులు అమరులు అయ్యారు.

'Galwan heroes' likely to be honoured posthumously on Republic Day
గల్వాన్​ వీరులకు పురస్కారాలు!

By

Published : Jan 11, 2021, 8:34 PM IST

Updated : Jan 11, 2021, 10:22 PM IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. గల్వాన్​ ఘటనలో అమరులైన జవానులకు మరణాంతర సైనిక పురస్కారాలు అందించనుంది కేంద్రం. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి.

కర్నల్ సంతోష్ బాబు సహా.. గల్వాన్​ ఘటనలో చైనాను తిప్పికోట్టే క్రమంలో ప్రాణాలు అర్పించిన జవానులను.. మరణాంతరం ఇచ్చే గ్యాలెంటరీ పురస్కారాలతో గౌరవించనుంది ప్రభుత్వం.

అమరులను ప్రముఖ 'చక్ర' పురస్కారాలతో కేంద్రం గౌరవించనుంది. వీటిలో పరమవీరచక్ర, వీర్​ చక్ర, మహవీర్ చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు ఉన్నాయి.

గతేడాది జూన్​ 15న జరిగిన ఈ ఘటనలో 20మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు లద్దాఖ్​లోని పోస్ట్​ 120 ప్రాంతంలో గ్యాలెంట్స్ ఆఫ్​ గల్వాన్​ పేరుతో సైన్యం ఇప్పటికే స్మారకాన్ని నిర్మించింది. సైనిక వ్యవహారాల శాఖ కూడా దిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్​లో ఈ సైనికుల పేర్లు నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఆరోజు ఏం జరిగిందంటే..

సరిహద్దు ఉద్రిక్తతలు పతాక స్థాయిలో ఉన్న వేళ.. గల్వాన్​లోని పాట్రోలింగ్ పాయింట్ 14 వద్ద అక్రమ కట్టడాలను వ్యతిరేకించిన భారత సైనికులపై చైనా దాడి చేసింది. రాళ్లు, ముళ్లకర్రలు, ఇనప రాడ్లతో చైనా సైనికులు దాడి చేశారు. ఈ క్రమంలో 20 మంది భారత సైనికులు మృతిచెందారు. అమెరికా నిఘా వర్గాలు వెల్లడించిన నివేదికలో 35 మంది చైనా సైనికులు మృతి చెందారని పేర్కొంది.

ఇదీ చదవండి :'మీరు పరిష్కరిస్తారా? చట్టాలపై మేము స్టే విధించాలా?'

Last Updated : Jan 11, 2021, 10:22 PM IST

ABOUT THE AUTHOR

...view details