భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ యాత్ర 2022 చివరినాటికి లేదా 2023 ప్రారంభంలో.. జరుగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మానవ సహిత యాత్ర కరోనా కారణంగా వాయిదా పడిందని చెప్పారు.
" మనం ఇదివరకే గగన్‌యాన్ యాత్రను ప్రారంభించాల్సింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు జరగాల్సింది. కానీ కొవిడ్-19 కారణంగా వాయిదా పడింది. వచ్చే ఏడాది చివరినాటికి లేదా 2023 ప్రారంభంలో ఈ యాత్ర ప్రారంభం అవ్వొచ్చు."
-- జితేంద్ర సింగ్, కేంద్ర మంత్రి